తేనె తీసి.. తాగేసిన మంత్రి

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏ కార్యక్రమాలకు వెళ్లిన అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి ప్రజలను ఆకట్టుకోవడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈత వనాలకు వెళ్ళినప్పుడు కల్లు తాగి గీతా కార్మికులకు ఉత్సాహాన్ని నింపడం, గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్లేటప్పుడు భుజాన గొంగడి, నెత్తిన రుమాల కట్టుకొని చేతిలో గొర్రె పిల్లను పట్టుకోవడం అందరిని ఆకట్టుకోవడం మంచి సన్నివేశాలు పాఠకులకు విధితమే.. గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పల్లె […]

Update: 2021-07-01 11:03 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏ కార్యక్రమాలకు వెళ్లిన అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి ప్రజలను ఆకట్టుకోవడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈత వనాలకు వెళ్ళినప్పుడు కల్లు తాగి గీతా కార్మికులకు ఉత్సాహాన్ని నింపడం, గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్లేటప్పుడు భుజాన గొంగడి, నెత్తిన రుమాల కట్టుకొని చేతిలో గొర్రె పిల్లను పట్టుకోవడం అందరిని ఆకట్టుకోవడం మంచి సన్నివేశాలు పాఠకులకు విధితమే.. గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండ గ్రామంలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జేసీబీతో మంత్రి స్వయంగా కంప చెట్లను తొలగించే క్రమంలో ఆయనకు తేనెతెట్టు కనిపించింది. వెంటనే ఆ పుట్ట చుట్టూ ఉన్న ఈగలను తొలగించి తేనెను తీశారు. ఈగలు కరుస్తాయని అక్కడ ఉన్న వారు వారిస్తున్నా మంత్రి తన ప్రయత్నం కొనసాగించి తేనే తీశారు. తీసిన తేనెను అక్కడున్న వారికి కొంత పంచి మరికొంత ఆయన తాగారు. ఈ సంఘటనను అక్కడున్న వారు ఆసక్తిగా తిలకించారు.

Tags:    

Similar News