తబ్లిఘీ జమాత్ చీఫ్‌కు కరోనా నెగిటివ్

న్యూఢిల్లీ: తబ్లిఘీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కాంధల్వీకి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చినట్టు ఆయన తరఫు లాయర్ ఆదివారం వెల్లడించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. సుమారు 14వందల మందితో సమావేశం నిర్వహించి, దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపిస్తూ.. మౌలానా సాద్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను విచారించాల్సి ఉండగా, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఆదేశాల […]

Update: 2020-04-26 06:13 GMT

న్యూఢిల్లీ: తబ్లిఘీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కాంధల్వీకి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చినట్టు ఆయన తరఫు లాయర్ ఆదివారం వెల్లడించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. సుమారు 14వందల మందితో సమావేశం నిర్వహించి, దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపిస్తూ.. మౌలానా సాద్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను విచారించాల్సి ఉండగా, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఆదేశాల మేరకు ఈ టెస్టులు నిర్వహించారు. నెగిటివ్ రిపోర్టులు రావడంతో మౌలానాను సోమవారం విచారించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మనీలాండరింగ్ కేసు సైతం నమోదవ్వడంతో త్వరలోనే దీనిపైనా ఈడీ విచారణ చేపట్టనుంది.

tags: markaz, nizamuddin, tablighi jamaat, maulana saad kandhalvi, delhi, coronavirus, covid, delhi crime branch police

Tags:    

Similar News