క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్‌కు సర్వం సిద్దం
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలు పెట్టిన మెగా లీగ్ కరోనా కారణంగా వాయిదా పడటంతో క్రికెట్ అభిమానులు ఆందోళనలో పడ్డారు. కానీ బీసీసీఐ ఏ మాత్రం తగ్గకుండా ఐపీఎల్ 2021ని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా.. తమ ఆతిథ్యంలోనే యూఏఈలో పురుషుల టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను 2022కు వాయిదా వేశారు. […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలు పెట్టిన మెగా లీగ్ కరోనా కారణంగా వాయిదా పడటంతో క్రికెట్ అభిమానులు ఆందోళనలో పడ్డారు. కానీ బీసీసీఐ ఏ మాత్రం తగ్గకుండా ఐపీఎల్ 2021ని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా.. తమ ఆతిథ్యంలోనే యూఏఈలో పురుషుల టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను 2022కు వాయిదా వేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉన్నది. దీనిపై బీసీసీఐ, ఐసీసీ మధ్య చాలా చర్చలు జరిగాయి. చివరకు ఐపీఎల్ 2021 రెండో దశతో పాటు టీ20 వరల్డ్ కప్ కూడా యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఐసీసీతో పాటు యూఏఈ, ఒమన్ క్రికెట్ పెద్దలు అంగీకరించడంతో టీ20 వరల్డ్ కప్‌కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నేటి నుంచి ఒమన్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు.. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు యూఏఈలో ప్రారంభం కానున్నాయి.
అంతా సిద్దం..
ఇండియాలో కరోనా కేసుల పెరిగి పోవడంతో టీ20 వరల్డ్ కప్ నిర్వహణ కష్టంగా మారింది. 2016లో ఇండియాలోనే టీ20 వరల్డ్ కప్ జరిగింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల అసలు టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఐసీసీ షెడ్యూల్ మేరకు 2020లో టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగాలి. కానీ కరోనా కారణంగా ఆ దేశప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఐసీసీ వరల్డ్ కప్ వాయిదా వేసింది. టీ 20 వరల్డ్ కప్‌ల షెడ్యూల్‌లను ఐసీసీ మరోసారి సవరించింది. దీంతో 2021లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ ఇండియాలోనే జరుగుతుందని.. 2020లో జరగాల్సిన వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలోనే 2022లో నిర్వహిస్తామని చెప్పింది. అయితే 2021లో జరగాల్సిన వరల్డ్ కప్ కరోనా కారణంగా బీసీసీఐ నిర్వహించలేక పోయింది. కానీ.. ఐపీఎల్ 2021 తర్వాత టీ20 వరల్డ్ నిర్వహిస్తామని బీసీసీఐ తేల్చి చెప్పడంతో మార్గం సుగమమం అయ్యింది.
ఫేవరెట్స్ వీళ్లే..
టీ20 వరల్డ్ కప్ కోసం హేమాహేమీలు పోటీ పడుతున్నారు. అయితే ఈ సారి ఇండియా, ఇంగ్లాండ్ జట్టు ఫేవరెట్లుగా ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో చివరి సారిగా టీ20 వరల్డ్ కప్ జరిగింది. వెస్టిండీస్ జట్టు ఆనాడు వరల్డ్ కప్ కైవసం చేసుకున్నది. అయితే పలు కారణాల వల్ల ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించలేక పోయింది. ఈ మధ్యలో 2019 వన్డే వరల్డ్ కప్ జరిగింది. దాంట్లో తొలి సారిగా ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఉన్న టీమ్ ఫామ్స్‌ను బట్టి ఇంగ్లాండ్ లేదా ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. యూఏఈలో టీ20 వరల్డ్ కప్ జరగనున్నది. దీంతో పాకిస్తాన్ జట్టుకు కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ జట్టు యూఏఈలోని షార్జా, అబుదాబిలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతున్నది. గణాంకాలను పరిశీలిస్తే ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాంగ్ జట్లకే టీ20 వరల్డ్ కప్‌లో మంచి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇండియాకు ఛాన్స్ ఉందా?
టీమ్ ఇండియా వరల్డ్ కప్‌లో తొలుత రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నది. అక్టోబర్ 18న ఇంగ్లాండ్‌లో 20న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో ఆడనున్న మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉన్నది. టీమ్ ఇండియా ఇంత వరకు వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్ ఓడిపోలేదు. ఐసీసీ ఈవెంట్స్‌లో చాంపియన్స్ ట్రోఫీలో తప్ప టీమ్ ఇండియాకు ఎప్పుడూ పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉన్నది. అయితే కెప్టెన్ కోహ్లీ ఇంత వరకు ఐసీసీ టైటిల్ గెలవక పోవడమే అందరినీ కలవర పెడుతున్నది. ఎంఎస్ ధోనీ మెంటార్‌గా ఉండనున్నడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ వరల్డ్ కప్‌పై ఆశలు పెట్టుకున్నారు.
టీమ్ ఇండియా షెడ్యూల్
అక్టోబర్ 18 – ఇంగ్లాండ్ (వార్మప్ మ్యాచ్)
అక్టోబర్ 20 – ఆస్ట్రేలియా (వార్మప్ మ్యాచ్)
అక్టోబర్ 24 – పాకిస్తాన్
అక్టోబర్ 31 – న్యూజీలాండ్
నవంబర్ 3 – అఫ్గానిస్తాన్
నవంబర్ 5 – క్వాలిఫయర్‌తో