టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జలదీక్ష
దిశ, న్యూస్‌బ్యూరో: తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తూ ఈనెల 13న జలదీక్ష చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఆ రోజు సందర్శించి వాటి పురోగతిని పరిశీలిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల దగ్గర జదీక్ష చేసే నేతల పేర్లను ప్రకటించారు. ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద ఎమ్మెల్సీ […]
దిశ, న్యూస్‌బ్యూరో: తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తూ ఈనెల 13న జలదీక్ష చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఆ రోజు సందర్శించి వాటి పురోగతిని పరిశీలిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల దగ్గర జదీక్ష చేసే నేతల పేర్లను ప్రకటించారు. ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి, ఎల్లంపల్లి వద్ద ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు, కుసుమకుమార్, వంశీచందర్‌రెడ్డి, గౌరవల్లి జలాశయం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద పొన్నం ప్రభాకర్, దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్యెల్యే సీతక్క, దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే పొడెం వీరయ్య, వీహెచ్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాములు నాయక్, అలీసాగర్ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కామారెడ్డి సమీపంలోని ప్రాణహిత 22వ ప్యాకేజీ భూంపల్లి వద్ద షబ్బీర్ అలీ పాల్గొంటారని ఉత్తమ్ స్పష్టం చేశారు.