గుడ్‌న్యూస్ చెప్పిన SWIGGY.. డ్యూటీకి రాకున్నా జీతాలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఆఫర్లు ఇస్తూ.. సమయానికి ఇంటి ముంగిట్లోకి ఫుడ్‌ను తీసుకొచ్చే స్విగ్గీ.. తమ డెలివరీ పార్ట్‌నర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. డెలివరీని సమయానికి అందించి కస్టమర్లను సంతృప్తి పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు నెలకు రెండు రోజులు పెయిడ్ లీవ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు […]
దిశ, డైనమిక్ బ్యూరో: ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఆఫర్లు ఇస్తూ.. సమయానికి ఇంటి ముంగిట్లోకి ఫుడ్‌ను తీసుకొచ్చే స్విగ్గీ.. తమ డెలివరీ పార్ట్‌నర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. డెలివరీని సమయానికి అందించి కస్టమర్లను సంతృప్తి పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు నెలకు రెండు రోజులు పెయిడ్ లీవ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో వారికి కనీస ఆదాయాన్ని ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ విషయంపై స్విగ్గీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. మహిళలు తమ పీరియడ్స్ సమయంలో డెలివరీ చేసేందుకు రాలేకపోవడం గమనించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలో మహిళలను ప్రొత్సహించాలని, తద్వారా వీరి భాగస్వామ్యం కూడా పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. స్విగ్గీలో మొత్తం 2 లక్షల డెలివరీ భాగస్వామ్యులు ఉండగా.. అందులో వెయ్యి మంది మహిళా డెలివరీ భాగస్వామ్యులు ఉన్నారు. స్విగ్గీ నిర్ణయంతో ప్రతి డెలివరీ పార్ట్‌నర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.