స్విగ్గీ యాజమాన్యానికి ఫుడ్ డెలివరీ బాయ్స్ హెచ్చరిక

దిశ, శేరిలింగంపల్లి: కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కొండాపూర్‌లోని స్విగ్గీకి సంబంధించిన ఇన్‌స్టా మార్ట్ ఎదుట నిరసన చేపట్టారు. ఇప్పటికే యాజమన్యాలకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫార్మ్‌ వర్కర్స్‌ యూనియన్‌, వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన కారణంగా కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. డెలివరీ కనీస ఛార్జీ రూ.35గా ప్రకటించాలని, […]

Update: 2021-11-29 04:41 GMT

దిశ, శేరిలింగంపల్లి: కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కొండాపూర్‌లోని స్విగ్గీకి సంబంధించిన ఇన్‌స్టా మార్ట్ ఎదుట నిరసన చేపట్టారు. ఇప్పటికే యాజమన్యాలకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫార్మ్‌ వర్కర్స్‌ యూనియన్‌, వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన కారణంగా కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు.

డెలివరీ కనీస ఛార్జీ రూ.35గా ప్రకటించాలని, ప్రతీ కిలోమీటర్‌‌కు చెల్లించే మొత్తాన్ని రూ.6 నుంచి రూ. 12కు పెంచాలన్నారు. నెల రేటింగ్స్‌కి రూ.4000 బోనస్ ఇవ్వాలని, కస్టమర్‌ డోర్‌ స్టెప్‌ డెలివరీ ఛార్జీ రూ.5లను పునరుద్ధరించాలని కోరారు. డెలివరీ పరిధిని తగ్గించడానికి సూపర్‌ జోన్స్‌ తీసేయాలన్నారు. సమస్యలపై చర్చించేందుకు స్విగ్గీ యాజమాన్యానికి యూనియన్ వారం రోజుల గడువు ఇచ్చింది. ఒకవేళ స్విగ్గీ యాజమాన్యం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డిసెంబర్‌ 5 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ డెవివరీ నిలిచిపోయింది.

Tags:    

Similar News