స్విగ్గీలో ‘కొవిడ్ కేర్ కార్నర్’

దిశ, ఫీచర్స్ : COVID-19 సెకండ్ వేవ్ వల్ల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో కొవిడ్ బాధితులకు సాయపడేందుకు ఓ మంచి ఆలోచనతో ముందుకొచ్చిన ఫుడ్ డెలీవరీ సంస్థ ‘స్విగ్గీ’.. తమ యాప్‌లో ‘స్పెషల్ కొవిడ్ కార్నర్‌’ను జోడించింది. ఈ మేరకు ఒంటరిగా లేదా క్వారంటైన్‌లో ఉండేవారు ఈ స్విగ్గీ కేర్ కార్నర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ‘ఇంట్లో వండిన ఆహారం’తో పాటు సంరక్షణ ప్యాకేజీలు, మందులు, కిరాణా వస్తువులను మనం […]

Update: 2021-05-06 03:02 GMT

దిశ, ఫీచర్స్ : COVID-19 సెకండ్ వేవ్ వల్ల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో కొవిడ్ బాధితులకు సాయపడేందుకు ఓ మంచి ఆలోచనతో ముందుకొచ్చిన ఫుడ్ డెలీవరీ సంస్థ ‘స్విగ్గీ’.. తమ యాప్‌లో ‘స్పెషల్ కొవిడ్ కార్నర్‌’ను జోడించింది. ఈ మేరకు ఒంటరిగా లేదా క్వారంటైన్‌లో ఉండేవారు ఈ స్విగ్గీ కేర్ కార్నర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

‘ఇంట్లో వండిన ఆహారం’తో పాటు సంరక్షణ ప్యాకేజీలు, మందులు, కిరాణా వస్తువులను మనం ‘స్విగ్గీ కేర్ కార్నర్‌’లో ఎంచుకోవచ్చు. కావాల్సిన ఆప్షన్స్‌పై క్లిక్ చేస్తే, స్విగ్గీ జెనీలోకి ఎంటర్ అవుతాం. అక్కడ స్విగ్గీ ఎగ్జిక్యూటివ్‌ డెలివరీ ఫీజు వివరాలు అందిస్తాడు. ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఈ ఫీచర్ ఉపయోగపడనుండగా, ఈ విపత్కర పరిస్థితుల్లో చాలామంది తమ రోజువారీ అవసరాలను తీర్చుకునే క్రమంలో వైరస్ బారిన పడకుండా ఉండేలా సాయపడుతుందని స్విగ్గీ నిర్వాహకులు తెలిపారు.

ఎలా ఉపయోగించాలి?

స్విగ్గి కేర్ కార్నర్ విభాగానికి వెళ్లి కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ మందులు కావాలనుకుంటే దానిపై క్లిక్ చేయాలి. పికప్, డెలివరీ పాయింట్ ఎంచుకుని, మీ ఇంటి నుంచి ఎవరైనా బంధువు లేదా స్నేహితుడి ఇంటికి మందులు పంపాలనుకుంటే.. స్విగ్గీ జెనీ ద్వారా పంపే సౌకర్యం కూడా ఉంది. అన్ని వివరాలను నిర్ధారించుకున్న తర్వాత, కిరాణా లేదా మందులను షాప్ నుంచి పికప్ చేసుకునేందుకు స్విగ్గీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు వెళ్లడంతో పాటు అందుకు సంబంధించిన డబ్బులు చెల్లించేందుకు ఒక లింక్‌ను పంపుతాడు. ఒకే చేయగానే, పికప్ స్థానంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ తను తీసుకున్న వస్తువుల ఫొటోలు పంపిస్తాడు. అతడు సరైన ఉత్పత్తులు కొనుగోలు చేసినట్టు మనం నిర్ధారించుకున్న తర్వాత ఆ వస్తువులు/మందులను ఇంటికి తీసుకొస్తాడు.

Tags:    

Similar News