సముద్రం మధ్యలో 7 రోజులు.. 60 సినిమాలు.. ఒక్కరే ప్రేక్షకుడు

దిశ, ఫీచర్స్: సినిమా..థియేటర్‌లో విడుదలైతే..70 ఎంఎం స్క్రీన్‌పై వినోదాన్ని వీక్షిస్తే.. ఫేవరేట్ హీరో తెరనిండుగా కనిపిస్తే..అరెరె ఆ కిక్కే వేరప్పా అని సగటు సినిమా అభిమాని తప్పక అనుకుంటాడు. ఎంతగా ఓటీటీల హవా ఉన్నా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటాడు. పాండమిక్ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌కు దూరం చేయగా, ఇప్పుడిప్పుడే మళ్లీ టాకీసుల్లో సందడి పెరుగుతోంది. కాగా, ఫిల్మ్ ఫెస్టివల్స్ మాత్రం సంప్రదాయాలకు భిన్నంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ (జీఎఫ్ఎఫ్) ఓ బ్రాండ్ న్యూ […]

Update: 2021-02-03 06:25 GMT

దిశ, ఫీచర్స్: సినిమా..థియేటర్‌లో విడుదలైతే..70 ఎంఎం స్క్రీన్‌పై వినోదాన్ని వీక్షిస్తే.. ఫేవరేట్ హీరో తెరనిండుగా కనిపిస్తే..అరెరె ఆ కిక్కే వేరప్పా అని సగటు సినిమా అభిమాని తప్పక అనుకుంటాడు. ఎంతగా ఓటీటీల హవా ఉన్నా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటాడు. పాండమిక్ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌కు దూరం చేయగా, ఇప్పుడిప్పుడే మళ్లీ టాకీసుల్లో సందడి పెరుగుతోంది. కాగా, ఫిల్మ్ ఫెస్టివల్స్ మాత్రం సంప్రదాయాలకు భిన్నంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ (జీఎఫ్ఎఫ్) ఓ బ్రాండ్ న్యూ సినిమా‌ ఎక్స్‌పీరియన్స్ అందించబోతుంది. పాండమిక్‌ రోజులను తలపిస్తూ..ఫోన్, ఫ్యామిలీ, స్నేహితులతో పాటు బయట ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా, సినిమానే లోకంగా జీవిస్తే ఎలా ఉంటుంది? అదీ సముద్రం మధ్యలో ఏడు రోజులు..60 సినిమాలు..ఒకే ఒక్క ప్రేక్షకుడు..వావ్ వాటెన్ ఐడియా కదా! అదే ‘ఐసొలేటెడ్ సినిమా’. ఇంతకీ గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ఈ ఐసొలేటెడ్ ఫిల్మ్ ప్రొగ్రాం చూస్తుందెవరు? ఫిల్మ్ ఫెస్టివల్ విశేషాలేంటి? ఆ వివరాలు మీకోసం..

1979 నుంచి స్వీడన్‌లో ఏటా ‘గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్’ జరుగుతుంది. స్కాండినేవియాలో అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ ఇదే. ఏటా జనవరి చివరి వారంలో నిర్వహిస్తుండగా, పాండమిక్ కారణంగా ఈ ఏడాది ‘ఐసొలేటెడ్ సినిమా’ పేరుతో ఈ చిత్రోత్సవాన్ని భిన్నంగా ప్లాన్ చేశారు. బిగ్‌బాస్‌లో హౌజ్‌మేట్స్ అయినా ఉంటారు. కానీ, ఈ ఫిల్మ్ ప్రొగ్రాంలో ఒంటరిగా, ఫోన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేకుండా అసలు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా.. ఏడు రోజుల పాటు.. 60 సినిమాలు చూడాలి. జనవరి 30న ఈ ఫిల్మ్ ప్రొగ్రాం ప్రారంభమైంది. ఈ నెల 6న ముగియనుంది. ఇందుకోసం 45 దేశాల నుంచి 12 వేల అప్లికేషన్లు రాగా, అందరికీ ఇంటర్వ్యూ, టెస్ట్‌లు పూర్తి చేశారు. గతేడాది కొవిడ్‌పై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్‌గా అత్యవసర సేవలందించిన స్కావ్డేకు చెందిన నర్సు, సినీ ఔత్సాహికురాలు లిసా ఎన్రోత్ ఈ కార్యక్రమానికి ఎంపికైంది. ఇందుకుగాను పాటర్ నోస్టర్ ద్వీపంలోని లైట్‌హౌజ్‌లో నిర్వహించే ‘ఐసొలేటెడ్ సినిమా’ ప్రొగ్రాంలో ఆమె పాల్గొంది. ఎంతో భిన్నమైన అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్న లిసా, తన ‘ఐసొలేటెడ్ సినిమా’ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేస్తూ, నిర్వాహకుల సాయంతో యూట్యూబ్‌లో షేర్ చేస్తోంది. ‘ఈ అవకాశాన్ని పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా జీవితాంతం ఈ రోజును గుర్తుపెట్టుకుంటాను. ఈ ప్రదేశం ఎంతో అత్యద్భుతంగా ఉంది. మొదటి రోజు రెండు సినిమాలు చూశాను. అవి నా మనసుకు ఎంతో నచ్చాయి. పాండమిక్ కారణంగా నా వృత్తిలో భాగంగా ఎంతో అలసిపోయాను, శక్తిని కోల్పోయాను. జీవితంలో ఎన్నో యుగాలు గడిపినట్లు అనిపించింది. ఇప్పుడు నా మనసెంతో రిఫ్రెష్ అయింది. సముద్రం, చల్ల గాలి, సినిమా వావ్ సూపర్ ఎక్స్‌పీరియన్స్ ’ అని లిసా తన అనుభవాలను పంచుకుంది.

‘ఐసొలేటెడ్ సినిమా’ ప్రొగ్రాంను నోస్టర్ ద్వీపంలోనే కాకుండా, ‘ద డిసార్టెడ్ ఎరీనా’ వేదికతో పాటు ‘ద ఎంప్టీ థియేటర్’ ‌ల్లోనూ నిర్వహిస్తున్నారు. సినీ ప్రేక్షకులకు యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడం కోసం ఈ ప్లాన్ చేశారు. 50 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలకు, ప్రపంచ చాంపియన్‌షిప్ హాకీ గేమ్స్‌కు, ఎపిక్ అరేనా కాన్సర్స్ట్‌‌కు వేదికగా నిలిచిన ‘ద డిసార్టెడ్ ఎరీనా’లో 12,044 మంది ప్రేక్షకులు ఒకే సారి కూర్చునే అవకాశం ఉండగా ‘ఐసొలేటెడ్ సినిమా’ ప్రొగ్రాంలో భాగంగా కేవలం ఒక్కరి కోసం ఈ వేదిక తెరుచుకోనుంది. అలానే 700పైగా సీట్ల సామర్థ్యం గల సినిమా థియేటర్లలోనూ ఒక్కరి కోసమే సినిమా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైన డిజిటల్ ఫెస్టివల్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించడానికి గోథెన్‌బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నిర్వాహకులు స్వీడన్ అంతటా ప్రతి రాత్రి న్యూ ఫిల్మ్ ప్రీమియర్‌ మూవీలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తంగా 60 గాలా ప్రీమియర్లలతో పాటు, ఫిల్మ్ మేకర్ పరిచయాలు ప్రసారం చేస్తున్నారు.

Tags:    

Similar News