ఆ రెస్టారెంట్ లో ఒక్కరికే అనుమతి

దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్ త‌ర్వాత మళ్లీ మామూలు రోజుల్లా ప్రజలు జీవించగలరా? లేదా? అన్నది సందేహమే! సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల లో జనాలు ఒకే చోట గుంపులుగా కనపడే పరిస్థితి ఇప్పట్లో కనపించడం కష్టమే. ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. కానీ ఇందుకు స్వీడన్ మినహాయింపు. అక్కడి ప్రభుత్వం ప్రజలకే ఆ అవకాశాన్నిచ్చింది. సామాజిక దూరం పాటిస్తూ అన్ని పనులు చేసుకోవచ్చు. బార్లు, రెస్టారెంట్లు, స్కూళ్లు అన్నీ […]

Update: 2020-05-11 05:20 GMT

దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్ త‌ర్వాత మళ్లీ మామూలు రోజుల్లా ప్రజలు జీవించగలరా? లేదా? అన్నది సందేహమే! సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల లో జనాలు ఒకే చోట గుంపులుగా కనపడే పరిస్థితి ఇప్పట్లో కనపించడం కష్టమే. ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. కానీ ఇందుకు స్వీడన్ మినహాయింపు. అక్కడి ప్రభుత్వం ప్రజలకే ఆ అవకాశాన్నిచ్చింది. సామాజిక దూరం పాటిస్తూ అన్ని పనులు చేసుకోవచ్చు. బార్లు, రెస్టారెంట్లు, స్కూళ్లు అన్నీ తెరుచుకోవచ్చు. ఈ నిబంధనలకు అనుగుణంగానే స్వీడన్ లో ఇటీవలే ఓ కొత్త రెస్టారెంట్ ప్రారంభమైంది. ‘టేబుల్ ఫర్ వన్ ’ పేరుతో మొదలైన ఈ రెస్టారెంట్లో ఒక్కరోజు ఒక్కరికే అనుమతి.

స్వీడన్ లో ఓ జంట వినూత్నంగా ‘టేబుల్ ఫర్ వన్’ రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఇక్కడ ఫ్యామిలీ పార్టీలు కనిపించవు, ఫ్రెండ్స్ తో వేసే చిందులు ఉండవు, దద్దిరిల్లిపోయే సంగీతం వినిపించదు, అసలు ఆ రెస్టారెంట్ కి ఏ హంగులుండవు. భోజనం చేసే వారు తప్ప.. ఇంకా అక్కడ మనుషులెవరూ కూడా కాన రారు. ఒక టేబుల్ , ఒక కుర్చీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెస్టారెంట్ ఓపెన్ ఏరియాలో, చాలా అందంగా ఉంటుంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒంటరిగా కూర్చుని, వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ హాయిగా భోజనం చేయొచ్చు. ఆ రెస్టారెంట్ లో ఒక్క రోజు ఒక్కరికే ఆహారం అందిస్తారు. ఇక్క‌డ మ‌నం ఆర్డ‌ర్ చేసే ఫుడ్‌ను ఎవ‌రూ వ‌చ్చి స‌ర్వ్ చేయ‌రు. ఆ టేబుల్ నుంచి కిచెన్ వరకు ఓ తాడు కట్టి ఉంటుంది. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ నేరుగా పిక్నిక్ బుట్ట లో పెట్టి ఆ తాడు సాయంతో… కిచెన్ నుంచే కస్టమర్ దగ్గరకు పంపిస్తారు.

అలా మొదలైంది:

స్వీడన్ లోని వార్మ్ లాండ్ కి చెందిన రాస్మ‌స్ ప‌ర్స‌న్‌, లిండా కార్ల్‌స‌న్ దంప‌తుల‌ ఆలోచనల్లోంచి ఈ రెస్టారెంట్ వచ్చింది. అయితే ఓ సారి లాక్డౌన్ టైమ్ లో కార్ల్ సన్ తల్లిదండ్రులు, కార్ల సన్, రాస్మస్ ల ఇంటికి వచ్చారు. కార్ల్ సన్ ఇల్లు ఇరుకుగా ఉంది. అసలే కరోనా టైమ్ కావడంతో.. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటి పక్కనే ఉన్న గార్డెన్ లో భోజనం పెట్టాలని డిసైడ్ కావడంతో… వారంతా దూరం దూరంగా ఉండి భోజనం చేశారు. వారికి చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఆ టైమ్ లోనే వీరికి ‘టేబుల్ ఫర్ వన్ ’రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ప్ర‌పంచంలోనే ఏకైక‌ క‌రోనా సుర‌క్షిత రెస్టారెంట్‌గా దీన్ని మారుస్తామ‌ని కార్ల్ సన్ పేర్కొన్నారు. అంతేకాదు కరోనా వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని .. భోజనం చేశాక వారికి ఎంతో వీలైతే అంత ఇవ్వచ్చని ఆమె తెలిపారు. మే 10 నుంచి ఆగస్టు 1 వరకు రెస్టారెంట్ నిర్వహించాలని పెర్సన్ దంపతులు ఆలోచిస్తున్నారు. రెస్టారెంట్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను బట్టి ముందుక వెళ్లాలా వద్దా అన్నది డిసైడ్ అవుతామని ఆ దంపతులు చెబుతున్నారు.

మెనూ: ఇది పూర్తిగా వెజిటేరియన్ కు సంబంధించిన రెస్టారెంట్. అంతే కాదు ఇక్కడ అల్కహాల్ తాగడానికి కూడా పర్మిషన్ లేదు. మెనూ విషయానికి వస్తే స్వీడిష్ స్టైల్ హాష్ బ్రౌన్, స్వీట్ కార్న్ క్రాక్వెట్స్, స్మెటానా, సెర్పెంట్ రూట్ యాష్, ఐస్డ్ బట్టర్ మిల్క్.

Tags:    

Similar News