‘కైలాసా’నికి భారతీయులు రావొద్దు : నిత్యానంద
న్యూఢిల్లీ : కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో మారుమూల దీవులు, ప్రాంతాలకు వెళ్లిపోవాలనుకోవడం సహజమే. కానీ, స్వామి నిత్యానంద తన ‘కైలాసం’గా ప్రకటించుకున్న ఈక్వెడార్ సమీపంలోని దీవికి వెళ్లాలనుకుంటే మీ నిర్ణయాన్ని మార్చుకోక తప్పదు. ఎందుకంటే కరోనా విజృంభణ నేపథ్యంలో దాని కట్టడి కోసం స్వామి నిత్యానంద మనదేశం నుంచి భక్తుల రాకపై నిషేధం విధించారు. మనదేశమే కాదు, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ దేశాలు, మలేషియాల నుంచీ భక్తులు కైలాసానికి రావడానికి అనుమతించడం లేదని ఓ […]
న్యూఢిల్లీ : కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో మారుమూల దీవులు, ప్రాంతాలకు వెళ్లిపోవాలనుకోవడం సహజమే. కానీ, స్వామి నిత్యానంద తన ‘కైలాసం’గా ప్రకటించుకున్న ఈక్వెడార్ సమీపంలోని దీవికి వెళ్లాలనుకుంటే మీ నిర్ణయాన్ని మార్చుకోక తప్పదు. ఎందుకంటే కరోనా విజృంభణ నేపథ్యంలో దాని కట్టడి కోసం స్వామి నిత్యానంద మనదేశం నుంచి భక్తుల రాకపై నిషేధం విధించారు. మనదేశమే కాదు, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ దేశాలు, మలేషియాల నుంచీ భక్తులు కైలాసానికి రావడానికి అనుమతించడం లేదని ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రెసిడెంట్‌గా తాను ఈ ప్రకటన చేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. శ్రీ నిత్యానంద ట్విట్టర్ హ్యాండిల్‌లో చేసిన ఈ ఆదేశాల ట్వీట్ వైరల్ అయింది. దీనిపై మీమ్స్, జోకులు పేలుతున్నాయి.
దీన్ని ట్యాగ్ చేస్తూ భారత్‌లో కరోనా పరిస్థితులపై కొందరు సీరియస్‌గా స్పందించారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన స్వామి నిత్యానంద 2019లో దేశం విడిచి పరారయ్యారు. దక్షిణ అమెరికా దేశం ఈక్వెడర్ తీరంలోని ఓ దీవిలో మకాం పెట్టారు. అనంతరం స్వయంగా దాన్ని కైలాసంగా ప్రకటించారు. ఆ దీవిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని యూఎన్‌ను అభ్యర్థించడం, అక్కడొక రిజర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం, కొత్త కరెన్సీని ఆవిష్కరించడం వంటి అంశాలు కొన్నాళ్లక్రితం చర్చను లేవదీశాయి.