స్లాట్ బుకింగ్ నిలిపివేత.. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌ను నిలిపివేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం.. స్లాట్స్‌ బుకింగ్‌ కూడా నిలిపివేయాలని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి పాత కార్డ్‌ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుపాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు స్లాట్ బుక్ చేసుకున్న […]

Update: 2020-12-19 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌ను నిలిపివేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం.. స్లాట్స్‌ బుకింగ్‌ కూడా నిలిపివేయాలని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి పాత కార్డ్‌ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుపాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి యధావిథిగా రిజిస్టేషన్‌లు చేసుకోవచ్చిన ఉత్తర్వుల్లో తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్లాట్ బుకింగ్‌లు నిలిపివేసున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 21న రిజిస్ట్రేషన్‌లను పాత పద్ధతిలోనే అని తెలిపింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ధరణి విషయంలో సర్కార్‌ తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తోందని మండిపడింది. రిజిస్ట్రేషన్లకు ఆధార్‌, కులం, వ్యక్తిగత వివరాలను నమోదు చేయబోమన్న హామీని ఎందుకు ఉల్లంఘించారో తెలపాలని సీఎస్‌ను ఆదేశించింది.

Tags:    

Similar News