సర్పంచ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత !
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో సర్పంచ్‌పై పంచాయతీ ట్రిబ్యునల్ సస్పెన్షన్ ఎత్తివేసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సర్పంచ్ భూక్యా రవిసింగ్పై నిధుల దుర్వినియోగం ఆరోపణలతో గతంలో సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై రవిసింగ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. పంచాయతీ అధికారుల విచారణ నివేదికలను పరిశీలించిన ట్రిబ్యునల్ అవినీతి, ఆరోపణలు రుజువు కాలేదని, రాజకీయంగా ఆరోపణలు చేశారని గుర్తించింది. ఆయనపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని తీర్పునిచ్చింది. అయితే విధులపట్ల కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ట్రిబ్యునల్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో సర్పంచ్‌పై పంచాయతీ ట్రిబ్యునల్ సస్పెన్షన్ ఎత్తివేసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సర్పంచ్ భూక్యా రవిసింగ్పై నిధుల దుర్వినియోగం ఆరోపణలతో గతంలో సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై రవిసింగ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. పంచాయతీ అధికారుల విచారణ నివేదికలను పరిశీలించిన ట్రిబ్యునల్ అవినీతి, ఆరోపణలు రుజువు కాలేదని, రాజకీయంగా ఆరోపణలు చేశారని గుర్తించింది. ఆయనపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని తీర్పునిచ్చింది. అయితే విధులపట్ల కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ట్రిబ్యునల్ భావించింది. సర్పంచ్ రవిసింగ్ తొలి తప్పుగా భావించాలని అభ్యర్థించడంతో జరిమానా 20మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆదేశించింది.