ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. ఈ నెల 23న విచారణ చేపడతామని ప్రకటించింది. పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని ఎస్‌ఈసీ తరపు లాయర్ కోరగా.. శుక్రవారమే విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది. అయితే గతంలో ఇచ్చిన తీర్పులో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు తెలిపింది. ఎన్నికల ఫలితాలపై ఈ నెల 15న విచారణ […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. ఈ నెల 23న విచారణ చేపడతామని ప్రకటించింది. పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని ఎస్‌ఈసీ తరపు లాయర్ కోరగా.. శుక్రవారమే విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.
అయితే గతంలో ఇచ్చిన తీర్పులో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు తెలిపింది. ఎన్నికల ఫలితాలపై ఈ నెల 15న విచారణ జరగ్గా.. ఎస్‌ఈసీ మూడు పిటిషన్లలో రెండింటికి మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది. మూడో పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరింది. దీంతో అప్పుడు ఈ నెల 19కి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఆ తర్వాత ఇవాళ విచారణ జరగ్గా.. శుక్రవారానికి వాయిదా వేసింది.