డిసెంబర్ 14న ‘ఓత్ ఫర్ ఎస్ఎస్ఆర్’
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన(జూన్ 14) నాటి నుంచి తన చెల్లెలు శ్వేత సింగ్ కీర్తి ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సుశాంత్ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న శ్వేత.. తాజాగా ‘ఓత్ ఫర్ ఎస్ఎస్ఆర్’ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఎస్ఎస్ఆర్ ఫ్యాన్స్ అందరినీ ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆమె పిలుపునిచ్చింది. సుశాంత్ సింగ్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన(జూన్ 14) నాటి నుంచి తన చెల్లెలు శ్వేత సింగ్ కీర్తి ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సుశాంత్ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న శ్వేత.. తాజాగా ‘ఓత్ ఫర్ ఎస్ఎస్ఆర్’ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఎస్ఎస్ఆర్ ఫ్యాన్స్ అందరినీ ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా ఆమె పిలుపునిచ్చింది.
సుశాంత్ సింగ్‌కు న్యాయం జరగాలని మొదటి నుంచి తన గళాన్ని వినిపిస్తూ వస్తున్న శ్వేత.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు క్యాంపెయిన్స్ చేపట్టింది. డిసెంబర్ 14వ తేదీకి సుశాంత్ మరణించి ఆరు నెలలు పూర్తి కావస్తుండటంతో, శ్వేత మరోసారి ప్రభుత్వాన్ని కదలించేందుకు ‘ఓత్ ఫర్ ఎస్ఎస్ఆర్’ అనే క్యాంపెయిన్ చేయబోతున్నట్లుగా ట్వీట్ చేసింది. ఈ క్రమంలో ‘నిజం ఎప్పటికీ ‘కారణాన్ని’ నాశనం చేయదు. అందుకే ఓత్ ఫర్ ఎస్ఎస్ఆర్(#Oath4SSR) అని శ్వేత ట్వీట్‌లో పేర్కొంది.
TRUTH never damages a cause that is JUST…. #Oath4SSR pic.twitter.com/F1AWz1dF0W
— Shweta Singh Kirti (@shwetasinghkirt) December 6, 2020
ఇదిలా ఉండగా సుశాంత్ అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘సుశాంత్’కు న్యాయం జరగాలంటూ తాజాగా పాట్నాలోని ఓ దేవాలయంలో పూజలు చేసి, అన్నార్తులకు ప్రసాదాన్ని పంచి పెట్టారు. ఇక సుశాంత్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరిశీలిస్తున్నా.. ఇప్పటికీ ఎటువంటి ఆధారం దొరకపోగా, కేసులో ఎలాంటి పురోగతి లేదు.