నిజానికి మాత్రమే చోటుంది!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం ప్రపంచమంతా ఒక్కటైంది. తన మరణం వెనకున్న రహస్యాన్ని ఛేదించేందుకు.. సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుశాంత్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ‘CBIforSSR’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో రెండు నెలలుగా ఉద్యమించారు. కాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సుష్ తండ్రి పాట్నాలో కేసు పెట్టగా.. ఆ కేసును ముంబై పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రియాకు […]

Update: 2020-08-19 03:51 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం ప్రపంచమంతా ఒక్కటైంది. తన మరణం వెనకున్న రహస్యాన్ని ఛేదించేందుకు.. సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుశాంత్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ‘CBIforSSR’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో రెండు నెలలుగా ఉద్యమించారు. కాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సుష్ తండ్రి పాట్నాలో కేసు పెట్టగా.. ఆ కేసును ముంబై పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రియాకు అక్షింతలు వేస్తూనే.. సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో సుశాంత్ కుటుంబం, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ.. బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్వీట్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

సుశాంత్ మరణం తర్వాత..

ఈ రెండు నెలలు చాలా గందరగోళంగా గడిచాయని.. అసలు ఏది నిజమో? ఏది అబద్దమో? తెలియక చాలా మదనపడ్దామని తెలిపింది సుశాంత్ ఫ్రెండ్ కృతి సనన్. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సుప్రీం ఉత్తర్వులతో నిజం నిజంగా ప్రకాశిస్తుందనే నమ్మకం కలిగిందని చెప్పింది. ఇప్పటికైనా అందరూ ఊహాగానాలు మాని.. సీబీఐని పని చేయనివ్వాలని కోరింది కృతి.

సుశాంత్ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాజిటివ్ స్టెప్ పడిందన్నారు పరిణీతి చోప్రా. ఈ మూమెంట్‌ను గౌరవిస్తూ.. సీబీఐని తన పని తనను చేయనిద్దామని కోరింది. ఇప్పటికైనా అనవసర ఆరోపణలు, ఊహాగానాలు ఆపాలని.. ఎవరికి వారే సొంత కన్‌క్లూజన్ ఇవ్వకుండా ఉండాలని కోరింది.

ఐకమత్యానికున్న శక్తి మరోసారి రుజువైందన్నారు నుపుర్ సనన్. సీబీఐ విచారణకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.. నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందని.. అసలు నిజం బయటపడుతుందని నమ్ముతున్నట్లు తెలిపింది. ఇకపై కథలు అల్లడాలు, అనవసర ఊహాగానాలకు తావులేదని, ఒక్క నిజానికి మాత్రమే చోటుందని తెలిపింది.

సుశాంత్ కేసులో సీబీఐ విచారణపై హర్షం వ్యక్తం చేశారు అక్షయ్ కుమార్. అసలు నిజం బయటపడుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.

సుశాంత్ సింగ్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ హీరోయిన్ సంజనా సంఘీ సుప్రీం ఉత్తర్వులపై స్పందించింది. బాధాకరమైన రెండు నెలల తర్వాత న్యాయమైన తీర్పు వచ్చిందని తెలిపింది. గ్లోబల్ ప్రేయర్స్‌తో దేవుడు కరుణించాడని.. నిజం శక్తివంతమైనదని.. కచ్చితంగా బయటపడుతుందని ధీమా వ్యక్తం చేసింది.

Tags:    

Similar News