ఇద్దరు ఎమ్మార్వో లు సస్పెండ్…

దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లాల్లో ఇద్దరు ఎమ్మార్వోలు సస్పెండ్ అయ్యారు. అంతేగాకుండా మరికొంత మందిపై కూడా వేటు పడే అవకాశం ఉందని సమాచారం. వివరాళ్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని పెదవీడు గ్రామంలో సర్వే నెంబర్ 540 లో ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారి ఇతరులకు పట్టా చేశారు. 430 ఏకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా మోటివేషన్ చేశారు. 52 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానికులకు అక్రమంగా పట్టాలు మంజూరు చేశారని, సూర్యాపేట జిల్లా […]

Update: 2020-08-21 05:12 GMT

దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లాల్లో ఇద్దరు ఎమ్మార్వోలు సస్పెండ్ అయ్యారు. అంతేగాకుండా మరికొంత మందిపై కూడా వేటు పడే అవకాశం ఉందని సమాచారం. వివరాళ్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని పెదవీడు గ్రామంలో సర్వే నెంబర్ 540 లో ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారి ఇతరులకు పట్టా చేశారు. 430 ఏకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా మోటివేషన్ చేశారు.

52 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానికులకు అక్రమంగా పట్టాలు మంజూరు చేశారని, సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇద్దరు ఎమ్మార్వోలను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. 369 ఎకరాల భూమిని గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థకు అక్రమంగా పాసు పుస్తకాలను జారీ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడం బాధాకరమని ప్రభుత్వ భూములను ఇతరులకు పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News