ఈటలకు చెక్ పెట్టేందుకు.. హుజురాబాద్‌లో 200 మందితో నిఘా టీం..

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో గ్రామం యూనిట్ గా ఇంటలీజెన్స్ ఆరా తీస్తొంది. బైపోల్స్ పై ఎప్పటికప్పుడు సమాచారం అప్ డేట్ చేసేందుకు నిఘా వర్గాలు ఊరూ వాడా కలియతిరుగుతున్నాయి. సుమారు 200 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన అధికారులు ఓటర్ వైజ్ ఓపినియన్స్ పంపించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో హజురాబాద్ లోని ప్రతి పల్లెలోనూ ఇంటలీజెన్స్ పోలీసులు తిరుగుతున్నారు. గ్రామం యూనిట్… గ్రామానికో ఇంటలీజెన్స్ ఆఫీసర్ ను నియమించిన అధికారులు వీరు ఎప్పటికప్పడు […]

Update: 2021-07-10 21:02 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో గ్రామం యూనిట్ గా ఇంటలీజెన్స్ ఆరా తీస్తొంది. బైపోల్స్ పై ఎప్పటికప్పుడు సమాచారం అప్ డేట్ చేసేందుకు నిఘా వర్గాలు ఊరూ వాడా కలియతిరుగుతున్నాయి. సుమారు 200 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన అధికారులు ఓటర్ వైజ్ ఓపినియన్స్ పంపించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో హజురాబాద్ లోని ప్రతి పల్లెలోనూ ఇంటలీజెన్స్ పోలీసులు తిరుగుతున్నారు.

గ్రామం యూనిట్…

గ్రామానికో ఇంటలీజెన్స్ ఆఫీసర్ ను నియమించిన అధికారులు వీరు ఎప్పటికప్పడు ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు తోడు మండలానికి కూడా ప్రత్యేకంగా మరో అధికారి ఉంటారు. వీరు కూడా నివేదికలను పంపిచాల్సి ఉంటుంది. రెండు బృందాలు ఇచ్చిన నివేదికలను పోల్చుకుంటూ హుజురాబాద్ ఓటరు నాడిని పసిగట్టే పనిలో పడ్డారు ఇంటలీజెన్స్ బాసులు. ఓటరు మనోగతం ఏంటీ, వారిలో మార్పు వస్తోందా లేదా అన్న విషయంపై నివేదికల ద్వారా ఓ నిర్ణయానికి వస్తున్నట్టుగా సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన వారే కాకుండా రాష్ట్రంలోని పూర్వ పది జిల్లాలకు చెందిన యంత్రాంగాన్ని ఇందుకోసం డిప్యూటేషన్ చేసినట్టు సమాచారం.

పార్టీ సర్వేలు వేరే…

ఓ వైపున ఇంటలీ జెన్స్ వర్గాలు ఆరా తీస్తూనే ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కూడా సర్వే చేయిస్తోంది. ఆయా ఏజెన్సీలకు చెందిన వారు సింగిల్ గానే తిరుగుతూ ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కూడళ్లలో కూర్చున్న సాధారణ జనం ఏమనుకుంటున్నారు? కళ్లు మండువాల వద్ద జరుగుతున్న చర్చ ఏంటీ? ఈటలకు చెక్ పెట్టాలంటే ఎలా వ్యవహరించాలి అన్న విషయాల గురించి తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యాయి. టీఆర్ఎస్ గెలుపు కోసం అక్కడ చేపట్టాల్సిన చర్యలు ఏమిటీ, ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయగలిగే అంశాలను గుర్తించాల్సిన బాధ్యత కూడా ఏజెన్సీలపై ఉన్నట్టుగా తెలుస్తోంది.

Tags:    

Similar News