కరోనా ఉగ్రరూపం.. లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రముఖులే కాకుండా సామాన్య జనాలు కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాను అడ్డుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే చివరి అస్త్రం అని, లాక్‌డౌన్‌ విధింపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని సూచనలు చేసింది. ఇప్పటికే మహమ్మారి బారినపడిన రోగులకు ఆక్సిజన్ […]

Update: 2021-05-02 21:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రముఖులే కాకుండా సామాన్య జనాలు కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాను అడ్డుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే చివరి అస్త్రం అని, లాక్‌డౌన్‌ విధింపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని సూచనలు చేసింది. ఇప్పటికే మహమ్మారి బారినపడిన రోగులకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో లాక్‌డౌన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరి దీనిపై రాష్ట్రాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News