'షహీన్‌బాగ్'పై సుప్రీంలో పిటిషన్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనగా ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారిని ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ-నోయిడాలను కలిపే ఈ రోడ్డుపై దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళన కారణంగా స్థానికులు అవస్థలు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. బీజేపీ నేత నంద కిశోర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ.. విచారణకు ఓ తేదీ కోసం మెన్షనింగ్ అధికారిని […]
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనగా ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారిని ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీ-నోయిడాలను కలిపే ఈ రోడ్డుపై దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న ఆందోళన కారణంగా స్థానికులు అవస్థలు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
బీజేపీ నేత నంద కిశోర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ.. విచారణకు ఓ తేదీ కోసం మెన్షనింగ్ అధికారిని సంప్రదించాలని సూచించింది. షహీన్ బాగ్ ఆందోళన కారణంగా ఢిల్లీలోని పలు మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఓక్లా అండర్‌పాస్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.