వలస కూలీల సమస్యలు తీర్చండి : సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: వలస కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ శ్రామికుల కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. ఈ కష్టకాలంలో తప్పకుండా వారికి సహకరించాలని, అందుకోసం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర, యూటీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. వలస కూలీల అవస్తలకు పరిష్కారంగా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయన్న విషయాన్ని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, సంజయ్ కిషన్ కౌల్, ఎంఆర్ […]
న్యూఢిల్లీ: వలస కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ శ్రామికుల కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. ఈ కష్టకాలంలో తప్పకుండా వారికి సహకరించాలని, అందుకోసం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర, యూటీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. వలస కూలీల అవస్తలకు పరిష్కారంగా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయన్న విషయాన్ని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, సంజయ్ కిషన్ కౌల్, ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ విచారణలో భాగంగా వలస శ్రామికులకు వెంటనే ప్రయాణం, ఆహారం, ఆశ్రయ వసతులు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని పలురాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికుల బాధలను దృష్టిలో పెట్టుకుని ఈ కేసును సుమోటోగా స్వీకరించామని ధర్మాసనం తెలిపింది. వందలు, వేల కిలోమీటర్లు రోడ్లపై నడుచుకుంటూ, సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలు, ఘటనలను మీడియా ప్రతిరోజు రిపోర్ట్ చేస్తున్నదని పేర్కొంది. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఈ కూలీలు చిక్కుల్లో పడ్డారని, వీరిని ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆదుకోవాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం, ప్రయాణ సదుపాయాలు కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని గతంలో దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం గమనార్హం.