కేంద్రం, రైతు సంఘాలకు నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై ఆందోళన చేస్తోన్న రైతులను తరలించాలన్న పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రైతులను ఖాళీ చేయాలంటూ ఢిల్లీ వాసి రిషబ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ల దిగ్భంధనంపై రైతు సంఘాలకు, కేంద్రప్రభుత్వానికి సైతం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రేపటిలోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతో కమిటీ వేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం […]

Update: 2020-12-16 03:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై ఆందోళన చేస్తోన్న రైతులను తరలించాలన్న పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రైతులను ఖాళీ చేయాలంటూ ఢిల్లీ వాసి రిషబ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ల దిగ్భంధనంపై రైతు సంఘాలకు, కేంద్రప్రభుత్వానికి సైతం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రేపటిలోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతో కమిటీ వేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రైతుల ఆందోళనకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. కాగా, ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Tags:    

Similar News