ఏపీ సర్కారు, టీడీపీకి నోటీసులు

దిశ, వెబ్‎డెస్క్ : గుంటూరులో టీడీపీ కార్యాలయ భూ వివాదంలో టీడీపీ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‎పై విచారణ చేపట్టింది. ఈ మేరకు ఏపీ సర్కారు, టీడీపీకి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు. […]

Update: 2020-10-27 02:15 GMT

దిశ, వెబ్‎డెస్క్ : గుంటూరులో టీడీపీ కార్యాలయ భూ వివాదంలో టీడీపీ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‎పై విచారణ చేపట్టింది. ఈ మేరకు ఏపీ సర్కారు, టీడీపీకి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు.

సీఆర్డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించి భూ కేటాయింపులు జరిపారని.. వాటిని రద్దు చేయాలని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. గతంలో ఆర్కే పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఉత్వర్వులను ఆర్కే సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై మంగళవారం విచారించిన సుప్రీం.. నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News