న్యాయవాద దంపతుల హత్య కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో వామన్ రావు దంపతుల దారుణ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. న్యాయవాదుల హత్యపై యాంటి కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారి హత్య కేసుపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషనర్ అత్యున్నత ధర్మాసనాన్ని కోరారు. ఈ పిటిషన్ పై సీజేఐ ఎస్ఏ బోబ్డే ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వామన్ రావ్ దంపుతుల హత్య […]

Update: 2021-03-19 05:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో వామన్ రావు దంపతుల దారుణ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. న్యాయవాదుల హత్యపై యాంటి కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారి హత్య కేసుపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషనర్ అత్యున్నత ధర్మాసనాన్ని కోరారు.

ఈ పిటిషన్ పై సీజేఐ ఎస్ఏ బోబ్డే ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వామన్ రావ్ దంపుతుల హత్య కేసు అంశంలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే.. హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని ధర్మాసనం సూచించింది.

 

Tags:    

Similar News