కొండపోచమ్మసాగర్ పరిహారంపై సుప్రీంలో విచారణ
దిశ, వెబ్‌డెస్క్: కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పెళ్లికాని మేజర్ యువతకు సైతం విడిగా పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పెళ్లికాని మేజర్ యువకులు కుటుంబంలో భాగమేనని వాదనలు వినిపించగా.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి పరిహారానికి సంబంధించి ఇదివరకే దాఖలైన మరో పిటిషన్‌ను జతజేసింది.