సుప్రీంకోర్టు ఉద్యోగికి కరోనా
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్‌లో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకడంతో ఆ భవనాన్ని మంగళవారం మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా, సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికీ కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కాగా, కరోనా లక్షణాలు బయటపడిన తర్వాత సదరు ఉద్యోగి రెండుసార్లు కోర్టుకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోర్టుకు వచ్చిన సమయంలో ఆయన ఎవరెవరినీ కలిశారన్న దానిపై […]
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్‌లో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకడంతో ఆ భవనాన్ని మంగళవారం మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా, సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికీ కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కాగా, కరోనా లక్షణాలు బయటపడిన తర్వాత సదరు ఉద్యోగి రెండుసార్లు కోర్టుకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోర్టుకు వచ్చిన సమయంలో ఆయన ఎవరెవరినీ కలిశారన్న దానిపై ఆరాదీస్తున్నారు.
Tags: supreme court, corona, covid 19, supreme court registrar, isolation, corona positive to supreme court employee