ఖురాన్‌పై పిటిషన్.. సుప్రీంకోర్టు ఆగ్రహం

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ పవిత్ర ఖురాన్ నుంచి 26 శ్లోకాలను తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదో పనికిమాలిన చర్య అని తెలిపింది. తాము ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అసలు విషయానికొస్తే.. ఖురాన్‌లోని 26 శ్లోకాలు ఉగ్రవాదాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన షియా వక్ఫ్ బోర్డు చైర్మెన్ వసీం రిజ్వీ గతనెలలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. […]

Update: 2021-04-12 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ పవిత్ర ఖురాన్ నుంచి 26 శ్లోకాలను తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదో పనికిమాలిన చర్య అని తెలిపింది. తాము ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అసలు విషయానికొస్తే.. ఖురాన్‌లోని 26 శ్లోకాలు ఉగ్రవాదాన్ని పెంపొందించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన షియా వక్ఫ్ బోర్డు చైర్మెన్ వసీం రిజ్వీ గతనెలలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదర్సాలలో వీటిని బోధించడం వల్ల అక్కడి విద్యార్థులు వీటిని నేర్చుకుని ఉగ్రవాదం వైపునకు ఆకర్షితులవుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారీమణ్, బిఆర్ గవాయ్ ల ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఏ ఒక్క మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోమని తెలిపింది. ఇది నిరాదారమైన పిటిషన్ అని కొట్టివేసింది. అంతేగాక ఈ పిటిషన్ దాఖలు చేసిన రిజ్వికి రూ. 50 వేల జరిమానా విధించింది.

Tags:    

Similar News