లాక్‌డౌన్ ఎఫెక్ట్ : సుప్రీం కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ మూలాన చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు రేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్మికుల కోసం ప్రత్యేకంగా సామాజిక వంటశాలలు ఏర్పాటు చేయాలని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. అంతేకాకుండా వలస […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ మూలాన చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు రేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్మికుల కోసం ప్రత్యేకంగా సామాజిక వంటశాలలు ఏర్పాటు చేయాలని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. అంతేకాకుండా వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను చేయాలని పేర్కొంది.