టీఆర్ఎస్ అనుకూల గ్రామాల్లోనూ ఈటలకే మద్దతు
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకూల గ్రామాల్లోనూ ప్రజల మద్దతు ఈటలకే లభించింది. దీంతోనే ప్రతీ గ్రామంలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించింది. ప్రభుత్వ పథకాలు, హామీలను ప్రజలెవ్వరూ విశ్వసించలేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళిత బంధును షురూ చేసిన ఊర్లల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. శాలపల్లి, ఇందిరానగర్ కాలనీల్లో బీజేపీ హవా కొనసాగించడం గమనార్హం. ప్రతీ రోజూ ఓ మంత్రి ప్రచారం చేసినా.. టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకూల గ్రామాల్లోనూ ప్రజల మద్దతు ఈటలకే లభించింది. దీంతోనే ప్రతీ గ్రామంలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించింది. ప్రభుత్వ పథకాలు, హామీలను ప్రజలెవ్వరూ విశ్వసించలేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళిత బంధును షురూ చేసిన ఊర్లల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. శాలపల్లి, ఇందిరానగర్ కాలనీల్లో బీజేపీ హవా కొనసాగించడం గమనార్హం. ప్రతీ రోజూ ఓ మంత్రి ప్రచారం చేసినా.. టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. దీంతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మంత్రి హరీష్రావు అదే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతీ గ్రామంలోని గడప తట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటును వేయాలని అభ్యర్ధించారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీతో పోల్చితే తక్కువ ఓట్లనే తెచ్చుకున్నది.
ఇక టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు ముఖ్య లీడర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల ఊర్లలోనూ బీజేపీ అత్యధిక ఓట్లను సాధించుకోవడం గమనార్హం. మరోవైపు ఓటుకు సుమారు పది వేలు పంచినా టీఆర్ఎస్ పార్టీకి సరైన శాతంలో ఓట్లు రాలేదు. పైసలు కంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. ప్రజలు ఎంతో చైతన్యాన్ని ప్రదర్శించారని పలువురు రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నాయి.