సూపర్‌స్టార్ రజినీకి సమన్లు
సూపర్‌స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలపై సమన్లు జారీ అయ్యాయి. తూత్తుకుడి కాల్పుల ఘటనపై విచారణకు ఏర్పాటైన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రజినీకి సమన్లు జారీ చేసింది. గతేడాది తూత్తుకూడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరుపగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన రజినీ బాధితులను పరామర్శించి మాట్లాడుతూ,కొన్ని అసాంఘీక […]
సూపర్‌స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలపై సమన్లు జారీ అయ్యాయి. తూత్తుకుడి కాల్పుల ఘటనపై విచారణకు ఏర్పాటైన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రజినీకి సమన్లు జారీ చేసింది. గతేడాది తూత్తుకూడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరుపగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన రజినీ బాధితులను పరామర్శించి మాట్లాడుతూ,కొన్ని అసాంఘీక శక్తుల వల్లే పోలీసులు కాల్పులు చేశారనీ, తనకు ‘అన్నీ తెలుసని’ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 25న తమ ఎదుట హాజరు కావాలని ఏకసభ్య కమిషన్ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 379 మందిని కమిషన్ ప్రశ్నించింది.