గుడ్ న్యూస్.. మళ్లీ తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్..? అందుకే సినిమాలకు గ్యాపా..!
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి స్టార్ డమ్ అందుకుంది. అలా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన చిన్న నాటి ఫ్రెండ్ అయినటువంటి గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతే కాదండోయ్ ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది. ఇక బాబు పుట్టాక కొన్ని నెలలు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
కాజల్ అగర్వాల్ రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్టు ఓ పుకారు నెట్టింట షికారు చేస్తోంది. అందుకే సినిమా ఆఫర్లు వచ్చినా కానీ కమిట్ అవ్వడం లేదని, తనకు సెకండ్ డెలివరీ అయిన తర్వాతనే మళ్లీ సినిమాల్లోకి రావాలని చూస్తుందట. అయితే ఇద్దరు పిల్లలు పుడితే కంప్లీట్‌గా పిల్లల విషయంలో కంగారు లేకుండా .. సినిమాలపై దృష్టి పెట్టవచ్చని ఆమె సెకెండ్ సంతానానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.