ఇంటివద్దకే పండ్లు, కూరగాయలకు సూపర్ రెస్పాన్స్

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటి వద్దకే పండ్లు, కూరగాయలు కార్యక్రమానికి సూపర్ రెస్పాన్స్ వస్తోందని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2500 మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగా, కాల్ సెంటర్‌కు 408 ఫోన్లు, వాట్సప్‌ రిక్వెస్ట్‌లు 70 వచ్చాయన్నారు. దాదాపు 1370 చోట్ల పండ్లు, కూరగాయాల పంపిణీ జరిగిందని, ఫోన్ చేసిన 24గంటల్లోపు చేరేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు కాల్ […]

Update: 2020-04-13 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటి వద్దకే పండ్లు, కూరగాయలు కార్యక్రమానికి సూపర్ రెస్పాన్స్ వస్తోందని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2500 మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగా, కాల్ సెంటర్‌కు 408 ఫోన్లు, వాట్సప్‌ రిక్వెస్ట్‌లు 70 వచ్చాయన్నారు. దాదాపు 1370 చోట్ల పండ్లు, కూరగాయాల పంపిణీ జరిగిందని, ఫోన్ చేసిన 24గంటల్లోపు చేరేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ఆర్డర్ ఇవ్వాలనుకున్నవారు 733 073 3212 లేదా 911 444 5555 నంబరుకు చేసి అడ్రస్ చెబితే ఇంటికే పండ్లు, కూరగాయలు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

tags: Agriculture, Marketing Department, Home Fruits & Vegetables, Minister Niranjan Reddy, Telangana

Tags:    

Similar News