ఈ పిట్ట ఇట్లుందేంది..? మీరు చూశారా..?
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మగ పక్షి-ఆడ పక్షి ఉంటాయని విన్నం. కానీ, సగం ఆడ-సగం మగ పోలికలు ఉన్న ఉభయలింగజీవిని అమెరికా పరిశోధకులు గుర్తించారు. పౌడర్ మిల్ నేచర్ రిజర్వ్ సెంటర్‌లో ఈ గిజిగాడిని పట్టుకున్నారు. ఈ పికిలిపిట్ట కుడి వైపున పురుష రూపం, ఎడమ వైపున స్త్రీ రూపం కలిగి ఉంది. దీంతో పరిశోధకులు సైతం అబ్బురపడుతున్నారు. ఈ గిజిగాడి శాస్త్రియ నామంగా ఫియోటికస్ లూడోవిసియానస్ అని అంటారు. కానీ, అన్ని పిట్టల్లా ఇలా ఉభయలింగం […]
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మగ పక్షి-ఆడ పక్షి ఉంటాయని విన్నం. కానీ, సగం ఆడ-సగం మగ పోలికలు ఉన్న ఉభయలింగజీవిని అమెరికా పరిశోధకులు గుర్తించారు. పౌడర్ మిల్ నేచర్ రిజర్వ్ సెంటర్‌లో ఈ గిజిగాడిని పట్టుకున్నారు. ఈ పికిలిపిట్ట కుడి వైపున పురుష రూపం, ఎడమ వైపున స్త్రీ రూపం కలిగి ఉంది. దీంతో పరిశోధకులు సైతం అబ్బురపడుతున్నారు.
ఈ గిజిగాడి శాస్త్రియ నామంగా ఫియోటికస్ లూడోవిసియానస్ అని అంటారు. కానీ, అన్ని పిట్టల్లా ఇలా ఉభయలింగం కలిగి ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. పదిహేనేళ్ల క్రితం ఇటువంటివి చూశామని చెప్పుకొస్తున్నారు. అయితే, ఉభయలింగజీవిగా ఉండటానికి గల కారణాల పై పరిశోధనలు మొదలుపెట్టారు.
అండం అసాధరణ ఫలదీకరణం కారణంగా ఆడ, మగ లింగాలను పోలి జన్మించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, జన్యుపరంగా వీటి లక్షణాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో పరిశోధనలు చేశాకే చెబుతామంటున్నారు. దీంతో పాటు ఈ పిట్ట ద్వారా పునరుత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామంటున్నారు. 64 ఏళ్లుగా ఇటువంటి వాటిని కేవలం 10 మాత్రమే గుర్తించామని.. అందుకే పరిశోధనలు కూడా అంతుపట్టకుండా ఉందంటున్నారు.