ఇండియా మార్కెట్లోకి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్!

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ ఇండియాలో సరికొత్త లగ్జరీ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. 8 సిరీస్‌లో గ్రాన్ కూపే, ఎమ్8 కూపే పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్రాన్ కూపే మోడల్‌ను రెండు వేరియంట్‌లలో తీసుకొచ్చింది. ఈ మొడల్ ధరలు రూ. 1.29 కోట్ల నుంచి రూ. 1.55 కోట్లని సంస్థ వెల్లడించింది. ఎమ్8 కూపే పేరుతో లాంచ్ చేసిన అతి ఖరీదైన కారు ధరను రూ. 2.15 కోట్లని […]

Update: 2020-05-08 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ ఇండియాలో సరికొత్త లగ్జరీ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. 8 సిరీస్‌లో గ్రాన్ కూపే, ఎమ్8 కూపే పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్రాన్ కూపే మోడల్‌ను రెండు వేరియంట్‌లలో తీసుకొచ్చింది. ఈ మొడల్ ధరలు రూ. 1.29 కోట్ల నుంచి రూ. 1.55 కోట్లని సంస్థ వెల్లడించింది. ఎమ్8 కూపే పేరుతో లాంచ్ చేసిన అతి ఖరీదైన కారు ధరను రూ. 2.15 కోట్లని తెలిపింది. ఈ మోడల్ కారు మార్కెట్లోకి రావడంతో బీఎమ్‌డబ్ల్యూ కంపెనీలో ఇదే అతి విలాసవంతమైన, ఖరీదైన కారుగా నమోదైంది. అలాగే, ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన అతి శక్తివంతమైన 8 సిలిండర్ ఇంజన్‌లలో ఇదొకటి అని సంస్థ పేర్కొంది.

ఇక కరోనా వ్యాప్తి వల్ల విధించిన లాక్‌డౌన్ సడలింపు తర్వాత చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించామని, స్థానిక సంబంధిత అధికారుల అనుమతి తీసుకున్నట్టు శుక్రవారం ప్రకటించింది. గ్రాన్ కూపే మోడల్ కారు 3 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ప్రవేశపెట్టారు. అలాగే, 340 హెచ్‌పీ పవర్ 1600-4500 ఆర్‌పీఎమ్ వద్ద 500 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు వేగం 5.2 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ తెలిపింది.

Tags: German Luxury Cars, BMW India, Gran Coupe, M8 Sports Coupe, Gran Coupe Features, M8 Sports Coupe Price, Most Expensive BMWs

Tags:    

Similar News