కాకినాడ నూతన మేయర్‌గా సుంకర శివ ప్రసన్న

దిశ, ఏపీ బ్యూరో: కాకినాడ నూతన మేయర్ ఎవరనేదానిపై ఉత్కంఠ వీడింది. నూతన మేయర్‌గా సుంకర శివ ప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించారు. ప్రిసైడింగ్ అధికారి డా.లక్ష్మీషా అధ్యక్షత సోమవారం జరిగిన కాకినాడ కార్పొరేషన్ అత్యవసర సమావేశంలో 5వ డివిజన్ కార్పొరేటర్ సుజాత నూతన మేయర్ పేరును ప్రతిపాదించగా కార్పొరేటర్ ప్రసాద్ బలపరిచారు. దీంతో నూతన మేయర్‌గా శివ ప్రసన్న ఎంపికైనట్లు […]

Update: 2021-10-25 04:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: కాకినాడ నూతన మేయర్ ఎవరనేదానిపై ఉత్కంఠ వీడింది. నూతన మేయర్‌గా సుంకర శివ ప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించారు. ప్రిసైడింగ్ అధికారి డా.లక్ష్మీషా అధ్యక్షత సోమవారం జరిగిన కాకినాడ కార్పొరేషన్ అత్యవసర సమావేశంలో 5వ డివిజన్ కార్పొరేటర్ సుజాత నూతన మేయర్ పేరును ప్రతిపాదించగా కార్పొరేటర్ ప్రసాద్ బలపరిచారు. దీంతో నూతన మేయర్‌గా శివ ప్రసన్న ఎంపికైనట్లు ప్రిసైడింగ్ అధికారి లక్ష్మీషా ప్రకటించారు.

టీడీపీ కార్పొరేటర్లు దూరం..

మేయర్ ఎన్నికకు సంబంధించి టీడీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. అయితే కోరం ఉండటంతో మేయర్ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి లక్ష్మీషా నిర్వహించారు. ఈ మేరకు నూతన మేయర్‌గా సుంకర శివ ప్రసన్న ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మేయర్ శివప్రసన్న మీడియాతో మాట్లాడుతూ..కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. సహచర కార్పొరేటర్లు తనకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే ఇప్పటి వరకూ మేయర్‌గా ఉన్న సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఎన్నికలు నిర్వహించారు. ఇకపోతే మేయర్‌గా ఒక మహిళను, రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఒక బీసీ( మత్స్యకార), ఎస్సీ(రెల్లి) కార్పొరేటర్లను ఎన్నుకున్నట్లు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు.

Tags:    

Similar News