తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఛైర్‌పర్సన్‌గా, మరో ఆరుగురిని సభ్యులుగా నియమించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ను డిసెంబరు 31లోగా నియమించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుని ప్రకటించింది. గత మహిళా కమిషన్ గడువు 2018 జూలైలో ముగిసినపోయినప్పటికీ కొత్త కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ నియమించలేదు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఛైర్‌పర్సన్‌గా, మరో ఆరుగురిని సభ్యులుగా నియమించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ను డిసెంబరు 31లోగా నియమించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుని ప్రకటించింది. గత మహిళా కమిషన్ గడువు 2018 జూలైలో ముగిసినపోయినప్పటికీ కొత్త కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ నియమించలేదు. వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో డిసెంబరు 31 డెడ్‌లైన్‌గా కొత్త కమిషన్‌ను నియమించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సునీతా లక్ష్మారెడ్డిని ఛైర్‌పర్సన్‌గా, షహీనా అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధం లక్ష్మి, కటారి రేవతిలను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిషన్ ఐదేళ్ళపాటు కొనసాగుతుందని సీఎస్ పేర్కొన్నారు.