గావస్కర్ తీసిన రెండు వికెట్లు అద్భుతం
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తన ఆటతో ఎన్నో రికార్డులు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లిటిల్ మాస్టర్ భారత క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడు. 125 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన గావస్కర్ 10,122 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పిన అతని ఖాతాలో 34 సెంచరీలు ఉన్నాయి. కానీ, చాలా మందికి గావస్కర్ బౌలింగ్ చేస్తాడనే విషయం తెలియదు. సుదీర్ఘ […]
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తన ఆటతో ఎన్నో రికార్డులు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లిటిల్ మాస్టర్ భారత క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడు. 125 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన గావస్కర్ 10,122 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పిన అతని ఖాతాలో 34 సెంచరీలు ఉన్నాయి. కానీ, చాలా మందికి గావస్కర్ బౌలింగ్ చేస్తాడనే విషయం తెలియదు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 380 బంతులు బౌలింగ్ చేశాడు. అంతేకాదు రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఒక వికెట్ టెస్టు మ్యాచ్‌లో తీయగా, మరొకటి వన్డేల్లో.. ఇక్కడే ఒక అద్భుతం దాగి ఉన్నది. తన కెరీర్‌లో రెండు ఫార్మాట్లలో తీసిన రెండు వికెట్లు ఒకే వ్యక్తివి కావడం గమనార్హం. అతను పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్. 1978-79 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా బిషన్ సింగ్ బేడీ కెప్టెన్సీలో సునీల్ గావస్కర్ మొదటిసారి బౌలింగ్ చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో జహీర్ అబ్బాస్ (96) పరుగుల వద్ద ఉండగా, సన్నీ బౌలింగ్‌లో చేతన్ చౌహాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్డేల్లో కూడా అబ్బాస్ మరోసారి సన్నీకి వికెట్ సమర్పించుకున్నాడు. ఇలా సునీల్ గావస్కర్ తన జీవితంలో తీసిన రెండు వికెట్లు జహీర్ అబ్బాస్‌వే కావడం గమనార్హం.