ప్రకృతి ప్రేమికుడిగా మొక్కలు నాటడం..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అంతరించిపోయిన అడవులను పునరుద్దిరించడానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపడుతోంది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతూ, వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించింది. ఇందులో భాగంగానే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. కాగా మంగళవారం ఈ ఛాలెంజ్‌లో హీరో సందీప్ కిషన్ పాల్గొని మొక్కలు నాటారు. లక్ష్మీ మంచు, నటుడు జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన, హైదరాబాద్‌లోని తమ ఇంటి ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. […]
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అంతరించిపోయిన అడవులను పునరుద్దిరించడానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపడుతోంది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతూ, వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించింది. ఇందులో భాగంగానే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు.
కాగా మంగళవారం ఈ ఛాలెంజ్‌లో హీరో సందీప్ కిషన్ పాల్గొని మొక్కలు నాటారు. లక్ష్మీ మంచు, నటుడు జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన, హైదరాబాద్‌లోని తమ ఇంటి ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ప్రకృతి ప్రేమికుడిగా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భూమితల్లి పచ్చగా ఉంటే, అందరూ ఆనందంగా ఉంటామని తెలిపారు.