ఆదివారం పంచాంగం, రాశి ఫలాలు (18-04-2021)

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షం తిధి : షష్ఠి సా 5.53 తదుపరి సప్తమి వారం : ఆదివారం (భానువాసరే) నక్షత్రం : ఆర్ధ్ర రా 12.42 తదుపరి పునర్వసు యోగం : అతిగండ సా 5.53 తదుపరి సుకర్మ కరణం : తైతుల సా 5.53 తదుపరి గరజి వర్జ్యం : ఉ 7.53 – 9.36 దుర్ముహూర్తం : ఉ 4.32 – 5.22 […]

Update: 2021-04-17 09:34 GMT

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : షష్ఠి సా 5.53
తదుపరి సప్తమి
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : ఆర్ధ్ర రా 12.42
తదుపరి పునర్వసు
యోగం : అతిగండ సా 5.53
తదుపరి సుకర్మ
కరణం : తైతుల సా 5.53
తదుపరి గరజి
వర్జ్యం : ఉ 7.53 – 9.36
దుర్ముహూర్తం : ఉ 4.32 – 5.22
అమృతకాలం : రా 1.55 – 3.38
రాహుకాలం : సా 4.30 – 6.00
యమగండం/కేతుకాలం : మ 12.00 – 1.30
సూర్యరాశి : మేషం || చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 5.46 || సూర్యాస్తమయం : 6.12

మేషం : ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణ సూచనలున్నవి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు. ​

వృషభం : కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ​

మిధునం : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ​

కర్కాటకం : కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల అందుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ​

సింహం : బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ​

కన్య : చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. ​

తుల : సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ​

వృశ్చికం : దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. ​

ధనస్సు : విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ​

మకరం : చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ​

కుంభం : నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ​

మీనం : చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు జరుగుతాయి.


Tags:    

Similar News