ఎందుకు అడ్డు వచ్చావ్.. సుందర్, బెయిర్ స్టో మధ్య మాటల యుద్ధం
దిశ, వెబ్ డెస్క్ : నిన్న అహ్మదాబాద్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీంఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోల మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. pic.twitter.com/XQX0WND1yu — Maqbool (@im_maqbool) […]
దిశ, వెబ్ డెస్క్ : నిన్న అహ్మదాబాద్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీంఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోల మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
— Maqbool (@im_maqbool) March 12, 2021
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతిని క్రీజులో ఉన్న డేవిడ్ మలాన్ బెయిర్ స్టో ఉన్న వైపు షాట్ కొట్టాడు. అయితే పరుగు కోసం.. బెయిర్ స్టో అప్పటికే క్రీజు నుంచి బయటకు వచ్చేశాడు. ఇదే సమయంలో.. కాట్ అండ్ బౌల్డ్‌కు అవకాశం ఉండడంతో సుందర్ కూడా బెయిర్ స్టో ఉన్న వైపు పరిగెత్తాడు. బంతిని అందుకునే క్రమంలో సుందర్ బెయిర్ స్టోపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో బంతి బెయిర్ స్టో హెల్మెట్‌కు తాకి పక్కకు వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహంతో సుందర్, బెయిర్ స్టో మధ్య మాటలు ఎక్స్‌చెంజ్ అయ్యాయి. బోయిర్ స్టో ఏదో అనడంతో సుందర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అనంతరం ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకొని.. వారిద్దరిని విడదీసి పక్కకు పంపించడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోనూ ముఖ్బాల్ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.