సూర్యుడిపై భారత సైంటిస్టుల ప్రయోగాలు.. కీలక విషయాలు వెల్లడి

దిశ, వెబ్‌డెస్క్: సమస్త జీవకోటికి ప్రాణాధారం సూర్యుడు. సూర్యుడు లేకపోతే అతి తక్కువ సమయంలో భూమిపై జీవం నశించడం ఖాయం. అయితే తాజాగా భారత శాస్త్రవేత్తలు సూర్యుని గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సూర్యుడు మారిపోయాడంట. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం. 1996-2007 కాలం నాటి సూర్యుడిని 2008-2019 మధ్య సూర్యుడితో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయంట. 2008-2019 మధ్య కాలంలో సూర్యుడు చల్లబడ్డాడని, సూర్యుడిపై […]

Update: 2021-12-19 22:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమస్త జీవకోటికి ప్రాణాధారం సూర్యుడు. సూర్యుడు లేకపోతే అతి తక్కువ సమయంలో భూమిపై జీవం నశించడం ఖాయం. అయితే తాజాగా భారత శాస్త్రవేత్తలు సూర్యుని గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సూర్యుడు మారిపోయాడంట. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం. 1996-2007 కాలం నాటి సూర్యుడిని 2008-2019 మధ్య సూర్యుడితో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయంట.

2008-2019 మధ్య కాలంలో సూర్యుడు చల్లబడ్డాడని, సూర్యుడిపై విస్పోటనాలు కూడా తగ్గాయని వారు చెప్పారు. ఆ సమయంలో సూర్యుడిపై కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (CME) పరిమాణం, ద్రవ్యరాశి మరియు అంతర్గత ఒత్తిడి గణనీయంగా తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సీఎమ్‌ఈ అంటే భారీ సౌర కణాల కారణంగా సూర్యునిపై జరిగే విస్పోటనాలు. ఇవి 2008-19 మధ్య కాలంలో గణనీయంగా తగ్గాయని, అందుకు కారణం తెలియాల్సి ఉందని వారు నివేదికలో పేర్కొన్నారు.

మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆ కాంబో డౌటే.

Tags:    

Similar News