క‌లెక్ట‌రేట్ వద్ద కలకలం.. పెట్రోల్ పోసుకొని నిప్పటించుకోబోయిన మహిళలు

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: హ‌న్మ‌కొండ క‌లెక్ట‌రేట్ ఎదుట ఇద్ద‌రి మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం క‌ల‌క‌లం రేపింది. తమ ఇంటి స్థ‌లాన్ని కొంతమంది కబ్జా చేశార‌ని పేర్కొంటూ ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. న్యాయం చేయాల‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని బాధితులు పిట్టల తిరుపతమ్మ, కావేరి పేర్కొన్నారు. హన్మకొండకు చెందిన వీరు సోమవారం జరిగే గ్రీవెన్స్ లో విన‌తిప‌త్రం అంద‌జేసేందుకు వ‌చ్చారు. అక్కడ కూడా అధికారులు పట్టించుకోకపోయేసరికి క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి […]

Update: 2021-10-11 02:28 GMT

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: హ‌న్మ‌కొండ క‌లెక్ట‌రేట్ ఎదుట ఇద్ద‌రి మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం క‌ల‌క‌లం రేపింది. తమ ఇంటి స్థ‌లాన్ని కొంతమంది కబ్జా చేశార‌ని పేర్కొంటూ ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. న్యాయం చేయాల‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని బాధితులు పిట్టల తిరుపతమ్మ, కావేరి పేర్కొన్నారు. హన్మకొండకు చెందిన వీరు సోమవారం జరిగే గ్రీవెన్స్ లో విన‌తిప‌త్రం అంద‌జేసేందుకు వ‌చ్చారు. అక్కడ కూడా అధికారులు పట్టించుకోకపోయేసరికి క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఈ విషయాన్ని గ‌మ‌నించిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News