ఆందోళనతో రాత్రిపూట నిద్రపట్టట్లేదా?
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ కేసులు ప్రతిరోజూ అంతకంతకూ పెరుగుతుండటం వల్ల.. జనాల్లో ఆందోళన తీవ్రతరమవుతోంది. దానికి తోడు.. అందరికీ సరిపడా మెడికల్ సెట్అప్ లేదని, సరిగా టెస్టులు చేయడం లేదని.. ఇలా కరోనాపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అంతేకాదు కరోనా సంక్షోభంలో ఒకవేళ ఉద్యోగం పోతే.. ఫైనాన్షియల్‌గా ఎలా మ్యానేజ్ చేయాలి? మళ్లీ జాబ్ దొరకుతుందా? అనే సందేహాలు కూడా చాలామందిలో యాంగ్జయిటీకి […]
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్ కేసులు ప్రతిరోజూ అంతకంతకూ పెరుగుతుండటం వల్ల.. జనాల్లో ఆందోళన తీవ్రతరమవుతోంది. దానికి తోడు.. అందరికీ సరిపడా మెడికల్ సెట్అప్ లేదని, సరిగా టెస్టులు చేయడం లేదని.. ఇలా కరోనాపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అంతేకాదు కరోనా సంక్షోభంలో ఒకవేళ ఉద్యోగం పోతే.. ఫైనాన్షియల్‌గా ఎలా మ్యానేజ్ చేయాలి? మళ్లీ జాబ్ దొరకుతుందా? అనే సందేహాలు కూడా చాలామందిలో యాంగ్జయిటీకి కారణమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆందోళన, డిప్రెషన్, ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ నుంచి ఎలా బయటపడాలి? వాటిని ఎలా ఫేస్ చేయాలి? అంటూ వచ్చే కాల్స్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. యూత్ నుంచి వృద్ధుల వరకు అందరిలోనూ ఈ తరహా ఆందోళన పెరిగిందని వారంటున్నారు. ఈ ఆలోచనల కారణంగానే చాలా మంది రాత్రి పూట నిద్రకు దూరమవుతున్నారని, ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నారని వెల్లడిస్తున్నారు. అయితే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే.. సరిగా నిద్రపోకపోతే ఆందోళనగా ఉంటుంది. అలానే ఆందోళనగా ఉన్నప్పుడు.. నిద్ర దరికి రాదు. వైస్ వెర్సా అన్నమాట. యాంగ్జయిటీ, స్లీప్ రెండూ ఇంటర్ కనెక్టెడ్ రిలేషన్ మెయింటెన్ చేస్తాయన్న మాట.
బిజీగా ఉంటే..
అన్నింటికన్నా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే.. రోజంతా బిజీగా గడపాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు.. డే మొత్తాన్ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. లేవగానే చిన్నపాటి వర్క్ అవుట్స్ చేయాలి. వాకింగ్, యోగా చేయాలి. ఏ పనీ లేకపోతే.. ఏదో పని కల్పించుకోవాలి. కుకింగ్, గార్డెనింగ్, బుక్స్ చదవడం, డ్యాన్స్ చేయడం, గేమ్స్ ఆడటం.. ఇలా ఏదైనా సరే రోజు మొత్తాన్ని బిజీగా గడపాలి. దీనివల్ల బాడీ అలిసిపోవడంతో పాటు అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు తగ్గుతాయి. దాంతో నిద్ర కూడా ఈజీగా పడుతుంది.
స్లీప్ వేక్ సైకిల్..
లాక్‌డౌన్ వల్ల చాలామంది లేట్ నైట్ పడుకునేందుకు అలవాటు పడ్డారు. దాంతో ఉదయం కూడా లేటుగా లేస్తున్నారు. దీనివల్ల శరీర వ్యవస్థలో రాత్రి, ఉదయాలను పోల్చుకోలేని కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. స్లీప్ సైకిల్ కూడా దెబ్బతింటుంది. ఈ క్రమంలో స్లీప్ టైమ్ మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. ప్రతిరోజు త్వరగా పడుకుని, త్వరగా లేవడం అలవాటు చేసుకుంటే.. ఆ టైమ్‌కు నిద్ర ఆటోమేటిక్‌గా వస్తుందని నిపుణుల మాట.
ఈట్ వెల్..
మన శరీరానికిచ్చే అందమైన బహుమతి ‘మంచి ఆహారం’. అనారోగ్యాన్ని గురిచేసే అనవసరమైన చిరుతిళ్లు, ఫాస్ట్‌పుడ్ ఐటెమ్స్ కాకుండా శరీరానికి ఉత్సాహాన్ని, శక్తిని అందించే ఆహారమే తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ తినడం గుడ్ హెల్త్‌కు చాలా ఇంపార్టెంట్. రాత్రి వేళ భోజనంలో వీలైనంత వరకు పెరుగును అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా రాత్రి పడుకునే ముందు ఓ గ్లాసు పాలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు బెడ్‌కు వెళ్లే రెండు గంటల ముందు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే అందులోని బ్లూ లైట్.. నిద్రను దూరం చేస్తుంది.
వాటర్ మ్యాటర్..
నీళ్లు శరీరానికి చాలా అవసరం. దాహంగా లేకపోయినా సరే వీలైనంతగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. నిమ్మరసం, కొబ్బరినీళ్లతో పాటు జ్యూస్‌లను డైట్‌లో భాగం చేసుకోవాలి. కార్బోనేటేడ్ డ్రింక్స్‌ను అవాయిడ్ చేయడం చాలా మంచిది. టీ, కాఫీలు కూడా రాత్రి పూట తాగకపోవడమే ఉత్తమం.
రూమ్ ఎలా ఉండాలంటే..
బెడ్ రూమ్‌ను వీలైనంత నీట్‌గా ఉంచుకోవాలి. రూమ్ టెంపరేచర్ నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు రూమంతా చీకటిగా ఉండాలి. వీలైతే రూమ్‌లో చిన్నపాటి సౌండ్‌తో మెలోడి సంగీతం వినిపించాలి. వీటితో పాటు కాసేపు మెడిటేషన్ చేసి నిద్రకు ఉపక్రమిస్తే.. మరింత బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.