‘స్పేస్‌ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్‌’లో డైనోసార్!

అదేదో నిజం డైనోసార్ అని భయపడిపోకండి.. బొమ్మ డైనోసార్ మాత్రమే. ఇద్దరు వ్యోమగాములతో బయల్దేరిన స్పేస్‌ఎక్స్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఈ బొమ్మ డైనోసార్ ఉండటం చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. రాకెట్ లాంచింగ్ వీడియో లైవ్ స్ట్రీమ్‌లో ఈ బొమ్మ డైనోసార్‌ను చూసిన నెటిజన్లు ఆ ఫొటోలను స్క్రీన్ షాట్స్ తీసి నెట్‌లో షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ డైనోసార్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఏం చేస్తుందంటే ? అంతరిక్ష నౌకలో జీరో జీ వాతావరణాన్ని పరీక్షించడానికి […]

Update: 2020-05-31 04:43 GMT

అదేదో నిజం డైనోసార్ అని భయపడిపోకండి.. బొమ్మ డైనోసార్ మాత్రమే. ఇద్దరు వ్యోమగాములతో బయల్దేరిన స్పేస్‌ఎక్స్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఈ బొమ్మ డైనోసార్ ఉండటం చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. రాకెట్ లాంచింగ్ వీడియో లైవ్ స్ట్రీమ్‌లో ఈ బొమ్మ డైనోసార్‌ను చూసిన నెటిజన్లు ఆ ఫొటోలను స్క్రీన్ షాట్స్ తీసి నెట్‌లో షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ డైనోసార్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఏం చేస్తుందంటే ?

అంతరిక్ష నౌకలో జీరో జీ వాతావరణాన్ని పరీక్షించడానికి ఒక బొమ్మలాంటి వస్తువు అవసరమవుతుంది. అందుకోసం ఈ డైనోసార్ బొమ్మను తన కొడుకు ఎంపిక చేసినట్లు వ్యోమగామి బెంకెన్ తెలిపారు. అయితే ఇలా అంతరిక్ష ప్రయాణాల్లో బొమ్మలను ఉపయోగించడం స్పేస్‌ఎక్స్ సంస్థకు కొత్తేం కాదు.. గతేడాది మార్చిలో పంపిన క్రూ డ్రాగన్‌లోనూ భూమి ఆకారంలో ఉన్న ఒక బొమ్మను సీఈవో ఇలాన్ మస్క్ పంపారు. ఈ జీరో జీ ఇండికేషన్ బొమ్మల ద్వారా అంతరిక్ష నౌక ఇంజిన్ నుంచి విడిపోయాక తాము మైక్రో గ్రావిటి స్థితికి చేరుకున్నామా లేదా అనేది వ్యోమగాములకు తెలుస్తుంది.

Tags:    

Similar News