వేద సమాజ్, ప్రార్థన సమాజ్: (ఇండియన్ హిస్టరీ.. గ్రూప్ 1, 2 స్పెషల్)
కె.సి. సేన్ కృషి ఫలితంగా మద్రాస్‌లో సుబ్బరాయలుశెట్టి 1864 “వేద సమాజ్” అనే ఆస్తిక సభను స్థాపించారు. తర్వాత కాలంలో ఇది దక్షిణ భారత బ్రహ్మ సమాజ్‌గా మారిపోయింది.
వేద సమాజ్:
కె.సి. సేన్ కృషి ఫలితంగా మద్రాస్‌లో సుబ్బరాయలుశెట్టి 1864 “వేద సమాజ్” అనే ఆస్తిక సభను స్థాపించారు. తర్వాత కాలంలో ఇది దక్షిణ భారత బ్రహ్మ సమాజ్‌గా మారిపోయింది.
తత్వబోదిని పత్రికను ప్రచురించింది.
ప్రార్థనా సమాజ్:
ప్రార్ధన సమాజ్, బ్రహ్మ సమాజ్ వల్ల ఉత్తేజితమైంది.
1867లో డా॥ ఆత్మారాం పాండురంగ నాయకత్వంలో బొంబాయిలో ఈ సమాజ్ ప్రారంభమైనది. కేశవచంద్రసేన్ ప్రోత్సాహం వల్ల ఈ సంస్థ ఉద్భవించింది.
ప్రార్ధనా సమాజ్ సభ్యులు ఆస్తికవాదులు
దీనిలో ముఖ్య సభ్యులు ఎం.జి.రనడే, ఆర్. జి.భండార్కర్, నారాయణ్ గణేష్ చంద్రవాడ్కర్, పండిత రమాబాయి సరస్వతి.
“సుబోధ” పత్రికను ప్రారంభించింది.
పండిత రమాబాయి సరస్వతి:
స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి, బాల్య వివాహాలను వ్యతికేరించడానికి పుణేలో “మహిళా ఆర్య సమాజ్”ను స్థాపించింది.
బొంబాయిలో 'శారదా నదన్' అనే వితంతు గృహాన్ని, పాఠశాలను ప్రారంభించింది. కరువు బాధితులను ఆదుకోవడానికి “ముక్తి సదన్”ను ప్రారంభించింది.
రమాభాయ్ రనడే పూన సేవాసదన్ స్థాపించింది.
డి.కె.కార్వే:
ఈయన గొప్ప విద్యావేత్త.
1893లో వితంతు వివాహం చేసుకున్నాడు.
1896లో “హిందూ వితంతు భవనం లేదా విధువ భవన్ ను ప్రారంభించాడు.
1916లో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు.
సాంఘిక సంస్కరణోద్యమానికి కార్వే చేసిన విశిష్ట సేవకు ప్రభుత్వం “భారతరత్న” బిరుదుతో సత్కరించింది.
ఎం. జి.రనడే:
ఇతన్ని మహారాష్ట్ర సోక్రటీస్ అంటారు.
ఇతను ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశాడు.
మహారాష్ట్రలో సాంఘికోద్యమానికి మూల పురుషుడు రనడే.
ఇతను 'సార్వజనిక సభ పత్రికలో సామాజిక, ఆర్థిక సమస్యల గురించి వ్యాసాలు రాశాడు.
1887లో మద్రాసులో ముఖ్యమైన సాంఘిక సమస్యలను చర్చించడానికి, భారత జాతీయ సామాజిక సమావేశాన్ని ప్రారంభించాడు.
రనడే “పరిశుద్ధి' ఉద్యమాన్ని ప్రారంభించి ఇతర మతస్తులను చేర్చుకోవడమే గాక, నాట్యవృత్తిని, ఖర్చులతో కూడిన ఆడంబర వివాహ వేడుకలను వ్యతిరేకించాడు.
కార్వేతో కలిసి రనడే “స్తీ పునర్వివాహ” ఉద్యమాన్ని నడిపాడు. ఈ ఉద్యమం మరో ఆశయం వితంతువులకు ఉపాధ్యాయులుగా, నర్సులుగా శిక్షణ ఇచ్చి వారికి స్వయం శక్తిని కల్పించడం.