బెంగాల్‌ గవర్నర్‌ జనరల్స్( ఇండియన్ హిస్టరీ.. గ్రూప్స్ ప్రత్యేకం)

వారెన్‌ హేస్టింగ్‌ (1774-85)

Update: 2023-05-11 17:08 GMT

వారెన్‌ హేస్టింగ్‌ (1774-85):

1774 - రోహిల్లా యుద్ధం (ఉత్తరప్రదేశ్‌ రోహిల్లాలు)

1775 - నందకుమార్‌ ఉరితీయబడుట (విచారణ ద్వారా బ్రిటీష్‌ వారిచే ఉరితీయబడ్డ మొదటి వ్యక్తి,)

1776 - మనుధర్మ "Code of Gentoo Laws అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడింది.

1775 - చైత్‌సింగ్‌ (బెనారస్‌), సంఘటన

1782 - అవధ్‌ బేగంల సంఘటన (వారి నగలను దొంగిలించాడు)

1754 - విలియం జోన్స్‌ బెంగాల్‌ ఏషియాటిక్‌ సొసైటీని స్థాపించుట. (దీని ముఖ్య ఉద్దేశం భారతదేశ చరిత్రను నిర్మించడం. ఈ సంస్థ ఏర్పాటులో ఇతనికి సహకరించిన వారు-వారెన్‌ హేస్టింగ్‌, హాలెడ్‌, విల్కిన్స్‌)

విలియం జోన్స్‌ అభిజ్ఞాన శాకుంతలమును ఆంగ్లంలోకి అనువదించాడు.

విల్కిన్స్‌ భగవద్గీతను "Song celestial " అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదించాడు.

హాలెడ్‌ హిందూ కోడ్‌ను రచించాడు.

హూగ్లీ వద్ద ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏర్పాటు చేశాడు

1781లో మేజర్‌ రన్నెల్‌ బెంగాల్‌ అట్లాస్‌ను రూపొందించాడు.

రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం : 1780-84

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం: 1775-82

పిట్స్‌ ఇండియా చట్టం: 1704

కారన్‌ వాలీస్‌ (1785-1798):

జునాధన్‌ డంకన్‌ 1791లో సంస్కృత కళాశాలను వారణాసిలో స్థాపించాడు.

1793 - జమీందారీ చట్టం లేదా శాశ్వత శిస్తు పరిష్కార చట్టం

ఇతనిని సివిల్‌ సర్వీస్‌ పితామహుడు అంటారు

పోలీస్‌, న్యాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు

న్యాయ శాఖను, పోలీస్‌ శాఖను వేరు చేశాడు

3వ ఆంగ్లో-మైసూరు యుద్ధం (1790-92) జరిగింది.

నాలుగు సర్క్యూట్‌ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు.

సర్‌ జాన్‌షోర్‌ (1793-1798):

వారన్‌ హేస్టింగ్‌ ఏర్పాటు చేసిన బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూకు అధ్యక్షులుగా పనిచేశాడు(1793)

జమీందారీ వ్యవస్థను రూపొందించాడు.

లార్ట్‌ వెల్లస్లీ (1798-1805):

ఇతనిని “బెంగాల్‌ పులి” అని అంటారు.

1798 లో సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు.

సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి సంస్థానం - హైదరాబాద్‌ (నిజాం ఆలీ)

ఉత్తర భారతదేశంలో సైనిక సహకార పద్ధతిలో చేరిన మొదటి రాజ్యం - అవధ్‌(సాదత్‌ అలీ)

4వ ఆంగ్లో-మైసూరు యుద్ధం - 1799

2వ ఆంగ్లో-మరాఠా యుద్ధం - 1802-1805

మద్రాస్‌ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు (కర్ణాటక ప్రాంతాన్ని కలిపాడు)

సివిల్‌ సర్వెంట్స్‌కు శిక్షణ ఇచ్చుటకు కలకత్తాలో విలియమ్స్‌ కళాశాలను ఏర్పాటు చేశాడు.

జార్జ్ బార్లో (1805-1807):

1806లో వెల్లూరు సైనికుల తిరుగుబాటు జరిగింది.

1వ మింటో (1807-1818):

1809లో అమృత్‌సర్‌ ఒప్పందం రంజిత్‌సింగ్‌తో జరిగింది.

దీని ప్రకారం బ్రిటీష్‌ పంజాబ్‌కు మధ్య సట్లెజ్‌ నది సరిహద్దుగా మారింది.

మార్చ్కేస్ట్‌ హేస్టింగ్‌ (1818-28):

నేపాల్‌ యుద్ధం : 1814-16

1818లో మరాఠాను ఆక్రమించాడు, పీష్వా పదవిని రద్దు చేశాడు.

పిండారీలను అణచివేశాడు (పిండారీలు అనగా పీష్వాలు ఏర్పాటు చేసిన బందిపోటు దొంగలు)

బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు

ఆమ్హరెస్ట్‌ (1828-1828):

మొదటి బర్మా యుద్ధం 1824-26

విలియం బెంటింక్‌ (1828-1833):

సతీసహగమన నిషేధ చట్టం -1829

స్థానిక న్యాయస్థానంలో ప్రాంతీయ భాషను ఉవయోగించుకోవచ్చనే నియమాన్ని రూపొందించాడు.

ధగ్గులను అణచివేశాడు (దారి దోపిడీ దొంగలు)

సర్క్యూట్ కోర్టులను రద్దు చేశాడు (కారన్‌ వాలీస్‌ ఏర్పాటు చేసినవి)

కలకత్తాలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశాడు.

1833 చార్టర్ చట్టం


ఇవి కూడా చదవండి:

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రోగ్రాం  

Tags:    

Similar News