గిరిజన, పౌర, రైతు తిరుగుబాట్లు (ఇండియన్ హిస్టరీ స్పెషల్)
డికూలు మైదాన ప్రాంతం నుంచి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి గిరిజన భూములను ఆక్రమించేవారు.
గిరిజన తిరుగుబాటుకు కారణాలు
డికూలు మైదాన ప్రాంతం నుంచి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి గిరిజన భూములను ఆక్రమించేవారు.
రైతు ఉద్యమాలు
రైతు ఉద్యమాలు రావడానికి గల కారణాలు :
తిన్‌కథియా :
దీని ప్రకారం రైతు తన వద్ద ఉన్న భూమిలో 3/20 వంతు భూమిలో నీలిమందును పండించాలి.
ఈ నీలిమందును బ్రిటీషు వారు నిర్ణయించిన ధరకు మార్కెట్‌లో మాత్రమే విక్రయించాలి.
శాశ్వత శిస్తు పరిష్కార చట్టం / జమీందారీ చట్టం(1793) :
దీని ప్రకారం రైతు భూమి యొక్క యాజమాన్యపు హక్కులను కోల్పోయాడు. కేవలం కౌలుదారుడుగా మిగిలాడు. శిస్తు వసూలు చేసేవారికి యాజమాన్య హక్కులు ఇవ్వబడ్డాయి. అతనినే జమీందారు అంటారు.
జమీందారు తను సేకరించిన శిస్తులో 1/11 వంతు తన వద్ద ఉంచుకుని మిగతా 10/11 వంతు శిస్తును బ్రిటీషు వారికి పంపించేవాడు.
విధానాలు :
నజరానా - పునరుద్దరణ రుసుము
బెదాఖ్లి - శిస్తు చెల్లించకపోతే బలవంతంగా భూమి నుంచి తొలగించడం
వెట్టి. - ఉచితంగా పనులు చేయడం
జోతేదార్ అనే అధికారులు అనేక రకాలైన ఇతర పన్నులను చట్ట వ్యతిరేకంగా రైతుల నుంచి వసూలు చేసేవారు.