భారతదేశ నైసర్గిక స్వరూపం (ఇండియన్ జాగ్రఫీ, గ్రూప్ -2 స్పెషల్)

ఒక దేశం భౌగోళికాంశాల గూర్చి వివరించటమే నైసర్గిక స్వరూపం అంటారు.

Update: 2023-04-01 12:30 GMT

ఒక దేశం భౌగోళికాంశాల గూర్చి వివరించటమే నైసర్గిక స్వరూపం అంటారు.

భారతదేశం విభిన్న భౌగోళిక స్వరూపాన్ని కలిగి ఉంది.

ద్వీపకల్ప పీఠభూమి కఠినమైన అగ్ని శిలలచే భూమిపై ఏర్పడిన ప్రాచీన పీఠభూమి.

భారతదేశ నైసర్గిక విభాగాలు:

భారతదేశ భూభాగం విభిన్న భౌగోళిక నిర్మాణాలను కలిగి ఉంది.

నిర్మాణం పరంగా భారతదేశం ఐదు నైసర్గిక విభాగాలుగా విభజించవచ్చు. అవి…

ఉత్తర పర్వతాలు

ఉత్తర విశాల మైదానాలు

ద్వీపకల్ప పీఠభూమి

తీర మైదానాలు, దీవులు

ఉత్తర పర్వతాలు:

ఉత్తర పర్వతాలు గొప్ప పర్వత శ్రేణులు, అనేక శ్రేణులలో గల ఉపరితల ఏటవాలు ప్రాంతం ద్వారా శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉన్నాయి.

వీటినే హిమాలయాలు (హిమ నివాసము) అంటారు.

పశ్చిమం నుండి తూర్పు దిశగా 2,500 కి.మీ వరకు విస్తరించబడి ఉంది.

పశ్చిమాన జమ్ము కశ్మీరులో గల సింధులోయ నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్‌లో గల బ్రహ్మపుత్రలోయ వరకు విస్తరించి ఉన్నాయి.

హిమాలయాల్లో అనేక శిఖరాలు సముద్రమట్టం నుండి 8000 మీటర్లకు పైగా ఎత్తును కలిగి ఉన్నాయి.

హిమాలయాల ఆవిర్భావం:

హిమాలయాలు అనేక రకాలుగా పర్వత శ్రేణులుగా ఉండి లోయలు, పీఠభూములచే వేరు చేయబడి ఉన్నాయి.

అనేక మిలియన్ల ఏళ్ల పూర్వం భూ ఉపరితల భాగాన అతిపెద్ద భూభాగం ఉండేది.

ఈ భూభాగం అన్ని వైపుల సముద్రంచే ఆవరించబడి ఉంది.

ఈ భూభాగాన్ని పేంజియా అని అంటారు.

నీటిచే ఆవరించబడి ఉండే భూభాగాన్ని పెంథలాసా అని అంటారు.

ఈ పెద్ద భూభాగం రెండు భాగాలుగా విభజించబడి ఉంది.

ఉత్తరార్ధ భాగాన గోండ్వానా భూభాగం అని అంటారు.

రెండు భూభాగాలను వేరు చేయు సముద్రాన్ని టెతిస్ సముద్రం అంటారు.

ఈ సముద్రం తూర్పు పశ్చిమ దిశ మీదుగా విస్తరించబడి ఉంది.

అంగారా, గోండ్వానా ప్రాంతంలోని నదులు శైథిల్య అవశేషాలను టెతిస్ సముద్రంలో నిక్షేపిస్తున్నాయి.

కాలక్రమేణా టెక్‌టానిక్ బాలల మధ్య నిక్షేపాలు పైకి నెట్టబడి ముడుత పర్వతాలు ఏర్పడ్డాయి. దీనినే హిమాలయ శ్రేణులు అంటారు.

హిమాలయాలు పశ్చిమం నుండి తూర్పు దిశగా మూడు ఉప విభాగాలుగా విభజించబడి ఉన్నాయి.

1. పశ్చిమ హిమాలయాలు

2. మధ్య హిమాలయాలు

3. తూర్పు హిమాలయాలు

పశ్చిమ హిమాలయాలను ట్రాన్స్ హిమాలయాలు అని కూడా అంటారు.

గంభీరమైన కారకోరమ్ పర్వతాలు పామీరు ముడి నుండి తూర్పు దిశగా విస్తరించి ఉన్నాయి.

గాడ్విన్ ఆస్టిన్‌ను కె2 (8,611మీటర్లు) అని కూడా అంటారు.

ఈ శ్రేణికి చెందిన కె2 ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శిఖరం.

ప్రస్తుతం కారకోరమ్ కనుమ, ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

కారకోరమ్‌కు దక్షిణాన బాల్‌తోరా, సియాచిన్ అను రెండు హిమనీ నదులు ఉన్నాయి.

ఇచ్చట లడక్, జస్కర్ అనబడే సమాంతర శ్రేణులున్నాయి.

లడక్ శ్రేణి విస్తీర్ణంను లడక్ పీఠభూమి అంటారు.

ఇది వాయువ్య కాశ్మీరులో ఉంది. ఇది భారతదేశంలోనే ఎత్తైన పీఠభూమి.

- చిట్ర ఆనంద్, సీనియర్ ఫ్యాకల్టీ.. హైదరాబాద్.

Tags:    

Similar News