తెలంగాణ జాగ్రఫీ.. నీటి పారుదల: (గ్రూప్ -2,3,4 , JL & SI/Constable)

నీటి పారుదల వ్యవసాయానికి అతి ముఖ్యమైనది. ఖచ్చితమైన నీటి పారుదల అందించాలంటే రుతుపవనాలు కూడా సరైన సమయంలో రావాలి.

Update: 2023-03-14 16:38 GMT

నీటి పారుదల వ్యవసాయానికి అతి ముఖ్యమైనది. ఖచ్చితమైన నీటి పారుదల అందించాలంటే రుతుపవనాలు కూడా సరైన సమయంలో రావాలి. నీటి పారుదల అందించినప్పుడు పంటసాగుతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. నీటి పారుదల అంశం పోటీ పరీక్షలో చాలా ముఖ్యమైనది. ఈ టాపిక్‌లో కనీసం 3 నుంచి 5 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ టాపిక్ నుంచి ముఖ్యాంశాలు బాగా చదువుకుంటే మంచి మార్కులు సాధించే వీలుంది.

నీటి పారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి

1. మేజర్ నీటిపారుదల ప్రాజెక్టు

2. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు

3. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు.

మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే పాతిక వేల ఎకరాలకు పైబడిన ఆయకట్టుకు నీటిని అందించడం.

మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు అనగా 5000 నుండి 25000 ఎకరాలు ఆయకట్టుకు నీటి సదుపాయం

మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనగా 5000 ఎకరాల కంటే తక్కువ ఎకరాలకు సాగునీటి పారుదల.

తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ముఖ్యంగా రెండు నదులపై ఆధారపడి ఉంటుంది.

అవి కృష్ణ, గోదావరి నదులు.

కృష్ణా, గోదావరి నదుల మొత్తం నీటి వాటా 1266.94 టీఎంసీలు.

కృష్ణా, గోదావరి నదులకు అదనపు నీటి వాటా 500 టీఎంసీలు.

కృష్ణా నది ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపు 967.94 టీఎంసీలు.

గోదావరి ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపు 299 టీఎంసీలు.

నోట్: టి.ఎం.సి అనగా థౌజండ్ మిలియన్ క్యూబిక్.

భూగర్భ జల పథకాలు

నోట్: భూగర్భ జల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది.

6వ మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ 2017-18 (ప్రొవిజనల్) ప్రకారం, భూగర్భ జల బావులు 4 రకాలు అవి. బావులు, లోతులేని గొట్టపు బావులు, మధ్యస్థ గొట్టపు బావులు.. లోతైన గొట్టపు బావులు.

మొత్తం భూగర్భజల బావులు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూగర్భ జల బావుల సంఖ్య 15,78,670.

అత్యధికంగా భూగర్భజల బావులు గల జిల్లా నిజామాబాద్ (1,15,431).

అత్యల్పంగా భూగర్భజల బావులు గల జిల్లా కొమురం భీం ఆసిఫాబాద్. (6,251).

అత్యధిక బావులు గల జిల్లాలు

నిజామాబాద్ : 1,15,431

నల్గొండ : 1,07690

సిద్ధిపేట : 99,257

సూర్యాపేట : 87,207

జగిత్యాల : 79,650

అత్యల్ప బావులు జిల్లాలు

కుమ్రంభీం : 6,251

మేడ్చల్ : 6,782

ములుగు : 10,975

ఆదిలాబాద్ : 17,301

భద్రాద్రి : 18,129

గమనిక: బావులు అనగా ముఖ్యంగా రెండు రకాలు. అవి 1. డగ్ బావులు (సాధారణ బావులు), 2. ట్యూబ్ బావులు (బోర్లు)

బోర్లు మూడు రకాలు అవి. లోతులేని గొట్టపు బావులు, మధ్యస్థ గొట్టపు, లోతైన గొట్టపు బావులు.

సాధారణ బావులు (డగ్ వెల్స్)

తెలంగాణ రాష్ట్రంలో సాధారణ బావులు సంఖ్య 4,57,625.

అత్యధికంగా సాధారణ బావులు గల జిల్లా కరీంనగర్ (60,711)

అత్యల్పంగా సాధారణ బావులు కలిగిన జిల్లా నారాయణపేట (38)

అత్యధిక డగ్‌వెల్స్ గల జిల్లాలు:

కరీంనగర్ : 60,711

జగిత్యాల : 56,127

మహబూబాబాద్ : 47,987

వరంగల్ : 45,859

పెద్దపల్లి : 36,378

అత్యల్ప డగ్‌వెల్స్ గల జిల్లాలు

నారాయణ పేట : 38

మేడ్చల్ మల్కాజ్‌గిరి : 49

మహబూబ్‌నగర్ : 68

మెదక్ : 366

ములుగు : 739

లోతులేని గొట్టపు బావులు

రాష్ట్రంలో లోతులేని గొట్టపు బావుల సంఖ్య 73,295.

అత్యధికంగా లోతులేని గొట్టపు బావులు గల జిల్లా సూర్యాపేట (18,040).

అత్యల్పంగా లోతులేని గొట్టపు బావులు గల జిల్లా మేడ్చల్ మల్కాజ్‌గిరి (175).

మధ్యస్థ గొట్టపు బావులు..

తెలంగాణ రాష్ట్రంలో మధ్యస్థ గొట్టపు బావుల సంఖ్య 6,78,518.

అత్యధికంగా మధ్యస్థ గొట్టపు బావులు గల జిల్లా నిజామాబాద్ (1,00,270)

అత్యల్పంగా మధ్యస్థ గొట్టపు బావులు గల జిల్లా కరీంనరగ్ జిల్లా (874)

లోతైన గొట్టపు బావులు:

తెంలగాణ రాష్ట్రంలో లోతైన గొట్టపు బావుల సంఖ్య 3,69,232.

అత్యధికంగా లోతైన గొట్టపు బావులు గల జిల్లా సిద్ధిపేట (52,244)

అత్యల్పంగా లోతైన గొట్టపు బావులు గల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్ (486)

- పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీ ఐఏఎస్ స్టడీ సర్కిల్.

Tags:    

Similar News