సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవం.. వివేకానంద, రామకృష్ణ పరమహంస
వివేకానంద(నరేంద్రనాథ్): స్వామి, కర్మయోగి, హిందూమత ఆధ్యాత్మిక రాయబారి
వివేకానంద(నరేంద్రనాథ్):
బిరుదులు - స్వామి, కర్మయోగి, హిందూమత ఆధ్యాత్మిక రాయబారి
ప్రస్తకాలు -Devine Life, ప్రాచ్య పాశ్చాత్య
సంస్థ - రామకృష్ణ మిషన్.
1897లో బెలూర్ (బెంగాల్) దగ్గర స్థాపించబడినది.
రామకృష్ణ మిషన్ రెండు వార్తాపత్రికలను ప్రచురించింది.
1) ప్రబుద్ధ భారత 2) ఉద్బోధన
1863 జనవరి 12న సురేంద్రనాథ్ దత్త, భువనేశ్వరీ దేవిలకు వివేకానంద జన్మించాడు.
1886లో ఇతని పేరు వివేకానందగా మారింది.
1888 పరిప్రజక లేదా సన్యాసి జీవితాన్ని స్వీకరించాడు.
1893లో అమెరికాలోని చికాగోలో ప్రపంచ సర్వమత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశాడు.
ఇతని శిష్యురాలు - మార్గరెట్ నోబుల్ (సిస్టర్. నివేదిత)
ఈమె 1898లో ఐర్లాండ్ నుండి భారత దేశానికి వచ్చింది.
ఈమె తన శేష జీవితాన్ని ఆర్.కె.మిషన్ ద్వారా ప్రజా సేవకు అంకితం చేసింది.
వివేకానంద తన రచనల ద్వారా ప్రాచీన భారతదేశ గొప్పతనాన్ని తెలియజేశాడు.
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో అనేక మంది నాయకులు ఇతని నుంచి స్ఫూర్తిని పొందారు.
వివేకానంద పిరికితనాన్ని ఖండించారు.
రామకృష్ణ మిషన్ ఉచిత పాఠశాలలను, ఉచిత వైద్యశాలలను, అనాథ శరణాలయాలను గ్రంథాలయాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసింది.
రామకృష్ణ మిషన్ కొన్ని వేల శాఖలు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి.
ఖేత్రిరాజు సలహా మేరకు నరేంద్రనాథ్ తన పేరును వివేకానందగా మార్చుకున్నాడు.
రామకృష్ణ పరమహంస:
అసలు పేరు - గదాధర్ ఛటోపాధ్యాయ
కలకత్తా దగ్గర దక్షిణేశ్వర్ వద్ద ఒక పేద బ్రాహ్మణ అర్చక కుటుంబంలో జన్మించాడు. ఇతను కాళీమాత భక్తుడు.
తాను తెలుసుకున్న సత్యమును చిన్న చిన్న కథల ద్వారా ప్రజలకు తెలియజేసేవాడు.
ప్రపంచంలో అనేక మతాలున్నాయని ప్రతీ మతం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం అని పేర్కొన్నాడు.
ఈ మోక్షంను సాధించుటకు ఒక్కొక్క మతం ఒక్కొక్క పధ్ధతిని అవలంభిస్తోందని పేర్కొన్నాడు.
ఇతని ఆరాధ్య దైవం- శారదాదేవి. ఇతని భార్య పేరు కూడా శారదాదేవి.
ఇతని ప్రధాన శిష్యుడు - వివేకానంద
ఇతని గురువు - ఈశ్వర్‌పూరీ
ఇవి కూడా చదవండి: