సుప్రీంకోర్టు అధికారాలు: ఇండియన్ పాలిటీ
ప్రాథమిక అధికార పరిధి, సలహా పూర్వక అధికారం
ప్రాథమిక అధికార పరిధి
సలహా పూర్వక అధికారం
పున: సమీక్షాధికారం
కోర్ట్ ఆఫ్ రికార్డ్స్
పర్యవేక్షణ అధికారాలు
రిట్లు
ప్రాథమిక అధికార పరిధి:
ఆర్టికల్ 131: సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి గురించి పేర్కొంటుంది.
కేవలం సుప్రీంకోర్టు మాత్రమే విచారించదగిన కేసులు
సమైఖ్య లక్షణం కాపాడటం దీని విధి.
ఉదాహరణకు చూస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు
కేంద్రం, కొన్ని రాష్ట్రాలు- ఇతర రాష్ట్రాల మధ్య వివాదాలు
రాష్ట్ర- రాష్ట్రాల మధ్య వివాదాలు
మినహాయింపులు:
ఆర్థిక సంఘం సిఫార్సులు
నదీ జలాల పంపకంపై పార్లమెంట్ చట్టం చేసినప్పుడు.
రిట్లు జారీ:
రిట్లు అనగా ఆదేశాలు జారీ చేయడం అని అర్థం
ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు 5 రకాల రిట్లు జారీ చేస్తుంది.
ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలతో పాటు ఇతర ఉల్లంఘనలకు రిట్లు జారీ చేస్తుంది.
రిట్లు జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకే ఎక్కువ అధికారాలున్నాయి.
సలహా పూర్వక అధికారం:
ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు.
సలహా పూర్వక అధికారంలో..
1. రాజ్యాంగపర అంశాలు
2. చట్టపర అంశాలు
3. పరిపాలన పరమైన అంశాలు ఉంటాయి.
రాజ్యాంగపర అంశాలు:
రాష్ట్రపతి రాజ్యాంగంలో లేని అంశాలు అడుగుతున్నారు కాబట్టి, సుప్రీంకోర్టు సలహాని తప్పనిసరిగా ఇవ్వాలి. రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి.
చట్టపర అంశాలు: రాజ్యాంగంలో ఉన్నది దానిని చట్టం చేయాలా..? వద్దా? అని సలహా అడిగితే సుప్రీంకోర్టు సలహా ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు.
రాష్ట్రపతి ఆ సలహాను పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు.
పరిపాలనాంశాలు: చట్టంలో ఉన్నది అమలు చేయాలా..? వద్దా..? అని సలహా అడిగితే సుప్రీంకోర్టు సలహా ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు.
రాష్ట్రపతి ఆ సలహాను పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు.
నోట్: రాష్ట్రపతి తన సందేహాన్ని అటర్నీ జనరల్ ద్వారా సలహా కోరతాడు.
సుప్రీంకోర్టు తన బహిరంగ తీర్పు ద్వారా సలహా ఇస్తుంది.
పున:సమీక్ష అధికారం:
కోర్టు తన తీర్పును తానే సమీక్ష చేసుకుంటుంది.
దీనినే పున: సమీక్షాధికారం అంటారు.
కోర్ట్ ఆఫ్ రికార్డ్:
ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి పేర్కొంటుంది.
కోర్టు తాను చెప్పిన తీర్పులను నివేదిక రూపంలో భద్రపరుస్తుంది.
ఆయా తీర్పులు న్యాయమూర్తులకు రిఫరెన్స్ లాగా ఉపయోగపడతాయి.
సమాజంలో కోర్టు తీర్పులు కూడా శాసనంలా చలామణిలో ఉంటాయి.
సుప్రీం కోర్టు తీర్పును వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు అందరూ పాటించాలి.
పర్యవేక్షణ అధికారం:
కింది స్థాయి కోర్టులను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది.
రక్షణ అధికారం:
రాజ్యాంగంను పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టుది.
రాజ్యాంగంను వ్యాఖ్యానించేది సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు తీర్పులు కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి.
దేశంలో అత్యున్నత శాసనం - భారత రాజ్యాంగం.